Devotional

ద్రౌపది ఔదార్యం..!!

ద్రౌపది ఔదార్యం..!!

     
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

🌿మహాభారత యుద్ధం చివరన భీముడు దుర్యోధనుడి తొడలు  విరగగొడతాడు.

🌸అప్పుడు దుర్యోధనుడు కొన ఊపిరితో వున్నప్పుడు అక్కడికి ఆశ్వత్టామ, కృపాచార్యుడు వస్తారు.

🌿అప్పుడు దుర్యోధనుడు అశ్వత్థామతో ‘పాండవులను ఎలాగైనా చంపి అపాండవం చేయ’మంటాడు.*

🌸Depending అతనికి ఆ పని చేస్తాననిమాట యిస్తాడు।*

🌿అతను ఆ రోజు రాత్రికి పాండవుల శిబిరానికి వెళ్లి పాండవులు పడుకునే స్థానంలో పడుకున్న ఉపపాండవుల ఐదుగురి (ద్రౌపది కొడుకులు)తలలు అమానుషంగా నరికి వెళ్లి పోతుండగా అర్జునుడు, కృష్ణుడు అతనిని వెంబడించి, యుద్ధం చేస్తాడు అర్జునుడు.

🌸అశ్వత్టామ ఉపసంహారం ఎలా చెయ్యాలో తెలియని బ్రహ్మశిరోనామక అస్త్రాన్నిఅర్జునుడి మీదికి వదులుతాడు.

🌿అప్పుడు అర్జునుడు బ్రహ్మాస్త్రముతో దాన్ని ఎదుర్కొంటాడు.

🌸ఆ రెండు అస్త్రాలూ ఆకాశం లో పోరాడుతుంటే అన్ని లోకాలూ కంపించి పోతాయి.

🌿ఆశ్వత్థమ కు ఉపసంహారం తెలీదు.. బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడు ఉపసంహరించుకుంటే అర్జునుడు ఆశ్వత్థామ అస్త్రానికి బలై పోతాడు.

🌸అప్పుడు కృష్ణుడు ఆశ్వత్థామ ను   ఆ అస్త్రము యొక్క దిశను మార్చి అభిమన్యుడి భార్య ఉత్తర గర్భము లోని బిడ్డకు తగిలేలా చేయ మంటాడు.

🌿అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించగానే అశ్వత్థామ వేసిన అస్త్రము ఉత్తర గర్భము లో వున్న బిడ్డకు తగిలి ఉత్తరకు మృతశిశువు పుడతాడు.

🌿ఏడుస్తున్న ఉత్తరను ఓదార్చి కృష్ణుడు ఆ బిడ్డను తన చేతితో నిమిరి బ్రతికిస్తాడు. అతడే పరీక్షిత్తు..అది తర్వాత కథ..

🌸అర్జునుడు అశ్వత్థామను చంప బోతుంటే కృష్ణుడు అతన్ని వారించి ద్రౌపది దగ్గరకుతీసుకొని పోదామని తీసుకొని పోతారు.

🌿అప్పుడు ద్రౌపది పుత్రశోకం తో చెప్పిన ఈ పద్యము చాలా ప్రసిద్ధ మైనది…
..
🌸ఉద్రేకంబున రారు శస్త్ర* ధరులై,యుద్ధావనిన్ లేరు,కిం
చిద్ద్రోహంబును నీకు జేయరు బలోత్సేకంబుతో చీకటిన్
భద్రాకారుల చిన్న పాపల రణ ప్రౌఢ  క్రియా హీనులన్
నిద్రాసక్తుల సంహరింప నకటా నీ చేతు లెట్లాడెనో

🌸అర్థము:– వారు ఉద్రేకముతో ఆయుధాలు ధరించి నీ మీదకు రాలేదు, యుద్ధ రంగములో లేరు,     నీకే అపకారమూ చేయలేదు ఇంకా పసివాళ్ళు     ఆదమరిచి నిద్ర పోతున్న పసిపాపలను చంపేందుకు నీకు చేతులెలా వచ్చాయి? నీవూ ఒక వీరుడవేనా అని నిందిస్తుంది, ఏడుస్తుంది.

🌿అర్జునుడు ‘వీడిని వధిస్తాను అని అంటే…వద్దని వారిస్తుంది.

🌸”గురుపుత్రుడు, బ్రాహ్మణుడు అతన్ని చంపుట మహాపాపము.  పైగా అతని తల్లికి పుత్ర శోకం కలిగించటం నాకిష్టము లేదు. ఆ శోకం ఎంత భయంకర మైనదో నాకు తెలుసు. అతని శిరస్సు పైనున్న రత్నాన్ని తీసి నాకివ్వు, అతని సర్వ శక్తులూ నశిస్తాయి. నిర్వీర్యుడై పోతాడు. అదే అతనికి తగిన శిక్ష!” అంటుంది.

🌿“అప్పుడు అర్జునుడు తన బాణము తో అతని తల పై వున్న మణిని పెకలించి  ద్రౌపదికి యిస్తాడు.

🌸ఐదుగురు కొడుకులను ఘాతుకంగా చంపిన అతనిని వదిలి వేస్తుంది.
అదీ ద్రౌపది ఔదార్యం…🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸