Politics

ఏపీ, తెలంగాణ సహా 9 రాష్ట్రాల ఎన్నికలకు ఈసీఐ సమాయత్తం

ఏపీ, తెలంగాణ సహా 9 రాష్ట్రాల ఎన్నికలకు ఈసీఐ సమాయత్తం

కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సహా 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్ని కలకు సిద్ధమవుతోంది. ఉమ్మడి ఎన్నికల గుర్తుల కోసం పార్టీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఎలక్షన్ సింబల్స్ (రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్) ఆర్డర్ 1968లోని పేరా 10-బిని అనుసరించి 2023-24 సంవత్సరాల్లో జరిగే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు ఉమ్మడి గుర్తుల కోసం దర బాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు జులై 17 తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు డిసెంబరు 12 తర్వాత, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు డిసెంబరు 17 తర్వాత దర వాస్తు చేసుకోవచ్చని తెలిపింది. వచ్చే ఏడాది కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మిజోరం, ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, సిక్కిం, అరుణాచల్ ప్ర దేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలతో పాటు, లోక్సభ సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ గడువు 2024 జనవరి 16తో, ఏపీ అసెంబ్లీ గడువు 2024 జూన్ 11తో, లోక్సభ 2024 జూన్ 16తో ముగియనున్నట్లు వెల్లడించింది. ఒకవేళ ఏదైనా అసెంబ్లీ గడువు తేదీ కంటే ముందే రద్దయితే, ఆ రోజు నుంచి నోటిఫి కేషన్ జారీచేసే నాటికి అయిదురోజుల ముందు ‘వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది