AP: జీవో నెంబర్ 84పై హైకోర్టు స్టే విధించింది. మున్సిపల్ స్కూళ్లను ZPH స్కూళ్లలో విలీనం చేస్తూ గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 84పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఇవాళ కోర్టులో విచారణ జరిగింది. పాఠశాలల విలీనాన్ని తప్పుబట్టిన హైకోర్టు ధర్మాసనం.. జీవో నెం. 84పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.