DailyDose

TNI నేటి నేర వార్తలు. కోడి కత్తి కేసు మళ్లీ వాయిదా. తదితర విశేషాలు

TNI నేటి నేర వార్తలు. కోడి కత్తి కేసు మళ్లీ వాయిదా. తదితర విశేషాలు

* అమరావతి…దేవాదాయశాఖలొ CGF నిధులపై హైకొర్టు ఘాటు వ్యాఖ్యలు

రేపు స్టేషనరి, పెట్రొలొ ఖర్చుకు వాడుతారు…..

CGF సొమ్ముతొ ప్రభుత్వాలను నడిపించలేరు…..

కర్నూల్, చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల AC ఆఫీసుల నిర్మాన నిధుల విడుదల చేస్తూ దేవాదాయశాఖ కమీష్నర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ పై హైకొర్టు స్టే ………

* అమరావతి: కోడికత్తి కేసు విచారణ జూన్ 15కు వాయిదా పడింది. గురువారం ఎన్‌ఐఏ కోర్టులో (NIA Court) ఈ కేసు విచారణకు రాగా ఎన్‌ఐఏ తరపున లాయర్ హాజరుకాకపోవడంతో పాటు వేసవి సెలవుల కారణంగా కేసు విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. కాగా.. ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి ప్రమోషన్‌పై కడపకు బదిలీ అయిన నేపథ్యంలో నూతనంగా వచ్చిన న్యాయమూర్తి ముందు మొదటి నుంచి పిటిషన్‌లపై వాదనలు జరగాల్సి ఉంది. అయితే ఈరోజు ఎన్‌ఐఏ తరపు న్యాయవాదలు ఎవరూ హాజరుకాకపోవడం, అలాగే వేసవి సెలవుల కారణంగా కేసు విచారణను కోర్టు జూన్ 15కు వాయిదా వేసింది. విచారణ నిమిత్తం నిందితుడు జనిపల్లి శ్రీను అలియాస్ కొడికత్తి శ్రీనును రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విజయవాడకు తీసుకువచ్చారు. కోడికత్తి శీను లాయర్ అబ్దుల్ సలీం కూడా కోర్టుకు వచ్చారు. అయితే విచారణను కోర్టు వాయిదా వేసిన నేపథ్యంలో నిందితుడిని తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

* కాకినాడ రైతుపోరుబాట కార్యక్రమంలో ఉద్రిక్తత – టీడీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ కు రైతుల ర్యాలీ – కాకినాడలోని జడ్పీ సెంటర్ వద్ద ర్యాలీని అడ్డుకున్న పోలీసులు – పోలీసులతో రైతులు, టీడీపీ నేతల వాగ్వాదం, తోపులాట – బారికేడ్లు తోసుకుని కలెక్టరేట్ వైపు దూసుకెళ్లిన రైతులు – ఆందోళనలో సొమ్మసిల్లిపడిపోయిన ఓ రైతు – ధాన్యం కొనుగోళ్లు కోరుతూ పోరుబాట తలపెట్టిన టీడీపీ

* టీడీపీ అధినేత చంద్రబాబు వాహనశ్రేణిలో మరోసారి బయటపడ్డ భద్రతా లోపాలు – ఉంగుటూరు వద్ద కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన వైసీపీ వాహనాలు – తాడేపల్లిగూడెం వరకు కాన్వాయ్‌ని అనుసరించిన 2 వైసీపీ వాహనాలు – వైసీపీ వాహనాలను నియంత్రించకుండా వదిలేసిన ఎస్కార్ట్ పోలీసులు

*

బ్రేకింగ్ న్యూస్.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:కాటారం మండలం నుండి చత్తీస్గడ్ మావోయిస్టులకు రూ.77 లక్షల నగదు మెడికల్ కిట్టు జిల్లేస్టిక్స్,నాలుగు సెల్ ఫోన్లు,ట్యాబ్ మూడు స్మార్ట్ వాచెస్ సరఫరా చేస్తున్న నలుగురిని పట్టుకొని అరెస్టు చూపిన జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి.

*

బ్రేకింగ్ న్యూస్….:

కూతురిని నరికి చంపిన తండ్రి
పెద్దపల్లి జిల్లాలో సంచలనం……

👉🏻మంథనిలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురిని అతి కిరాతకంగా తండ్రి నరికి చంపిన ఘటన పెద్దపెల్లి జిల్లాలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే… మంథని మండలం భట్టుపల్లి గ్రామంలో కన్న కూతురు రజిత (10)లు తండ్రి గుండ్ల సదయ్య గొడ్డలితో నరికి చంపాడు. అయితే గత కొంత కాలంగా సదయ్య మానసిక స్థితి సరిగా లేక గ్రామంలో జనాలపై తరచుగా దాడులు చేస్తున్నాడని స్థానికులు తెలిపారు. కూతురును చంపిన తర్వాత అదే గ్రామానికి మరో వ్యక్తి దూపం శ్రీనివాస్ పై దాడి కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

*

ఏపీ లో మరోసారి భారీగా డీఎస్పీ ల బదిలీలు..
50 మంది డీఎస్పీ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ..
మరో ఏడాది లో సార్వత్రిక ఎన్నికలు జగబోతున్న తరుణంలో చర్చనీయాంశం గా మారిన బదిలీలు..

* ఏసీబీకి పట్టుబడిన సబ్‌రిజిస్ట్రార్‌ శ్రీరామమూర్తి, డాక్యుమెంట్‌ రైటర్‌ రాము

రూ.15వేలు తీసుకుంటూ అడ్డంగా దొరికారు

పరారైన రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బంది

కంభం : లంచం తీసుకుంటూ సబ్‌రిజిస్ట్రార్‌, డాక్యుమెంట్‌ రైటర్‌ ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన బుధవారం కంభం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో చోటుచేసుకుంది. ఓ స్థలం రిజిస్ట్రేషన్‌కు రూ.15వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని ఏసీబీ డీఎస్పీ వి.శ్రీనివాసరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కంభం మండలం కందులాపురం గ్రామానికి చెందిన సాకం కృష్ణరంగారెడ్డి తన భార్య పేరుతో 205 గజాల స్థలానికి డాక్యుమెంట్‌ తయారు చేసి, రిజిస్టర్‌ చేయించుకునేందుకు రైటర్‌ శ్రీరామచంద్రరావు అలియాస్‌ రాము వద్దకు వెళ్లారు. డాక్యుమెంట్‌ను తీసుకొని సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీరామమూర్తి వద్దకు తీసుకెళ్లగా పరిశీలించిన ఆయన రూ.40వేల లంచం డిమాండ్‌ చేశారు. తాము అంత ఇచ్చుకోలేమని బాధితుడు తెలిపారు. చివరకు రూ.15వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బాధితుడు సాకం కృష్ణరంగారెడ్డి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై ఒంగోలు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు రంగం సిద్ధం చేశారు. బుధవారం డాక్యుమెంట్‌ రైటర్‌ రాము, సబ్‌రిజిస్ట్రార్‌ శ్రీరామమూర్తి బాధితుడి నుంచి రూ.15వేల నగదును తీసుకున్నారు. అప్పటికే మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడు, నిందితులిద్దరి నుంచీ వాంగ్మూలం నమోదు చేశారు. డాక్యుమెంట్‌ రైటర్‌, సబ్‌రిజిస్ట్రార్‌పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఏసీబీ అధికారుల రాకతో డాక్యుమెంట్‌రైటర్లు తమ గదులకు తాళాలు వేసి పరారయ్యారు.

సబ్‌రిజిస్ట్రార్‌ ఇల్లు సీజ్‌

కంభం సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీరామమూర్తికి చెందిన దర్శిలోని ఇంటిని బుధవారం రాత్రి ఏసీబీ అధికారులు సీజ్‌ చేశారు. ఆయన కంభం లో ఒక స్థలానికి సంబంధించిన రిజిస్ర్టేషన్‌లో అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి పట్టుబడ్డారు. అక్కడ్నుంచి సీఐ సత్యనారాయణ, గిరిబాబు, మరో ముగ్గురు ఎస్సైలు సాయంత్రం దర్శిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇంటికి తాళాలు వేసి ఉన్నాయి. పనిమనిషి ఉండడంతో ఆమెను అడిగారు. ఇంటి యజమానురాలు వైద్యం కోసం వెళ్లారని చెప్పడంతో కాసేపు ఏసీబీ అధికారులు చర్చించుకున్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌ ప్రసన్న, వీఆర్వో సమక్షంలో ఏసీబీ అధికారులు పంచనామా నిర్వహించి ఇంటిని సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ఆ ఇంటిని కుటుంబ సభ్యుల సమక్షంలో సోదాలు చేస్తామని చెప్పారు.

◾ || మహిళ పై అసభ్యంగా ప్రవర్తించిన జగిత్యాల ఎస్ఐ అనిల్ పై కేసు నమోదు || ◾

▪️జగిత్యాల ఎస్ఐ అనిల్ పై పలు సెక్షన్లు క్రింద కేసు నమోదు చేసిన పోలీసులు IPC Sec 290,323,341.

▪️ ఎఫ్ ఐ అర్ నమోదు చేసి జగిత్యాలకు బదిలీ చేశారు.

▪️MIM అధినేత