DailyDose

TNI తాజా వార్తలు. మహానాడు నిర్వహణకు కమిటీలు ఏర్పాటు. తదితర విశేషాలు.

TNI తాజా వార్తలు. మహానాడు నిర్వహణకు కమిటీలు ఏర్పాటు. తదితర విశేషాలు.

* అమరావతి : ఈనెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు – మహానాడు నిర్వహణ, నిర్ణయాలు తీర్మానాలపై కమిటీలు – మొత్తం 15 కమిటీలను నియమించిన టీడీపీ – తీర్మానాల కమిటీలో యనమల సహా 14 మంది సీనియర్లు

*

రైతుల్ని దోచుకునేందుకు వైసీపీ ఫోన్ పే బ్యాచ్ లు దిగాయి
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు

* నాకు చాలా మంది ఫోన్ చేసి ఇదెక్కడి విడ్డూరం రాజు గారూ ! అసలు మా సమస్యే జగన్ అయితే మళ్ళి సమస్యకే సమస్యను చెప్పటం ఏమిటి అన్నారు . నాకు నోట మాటరాలేదు కానీ తెగ నవ్వొచ్చింది . మన సమస్యకు డిసెంబర్లో పరిష్కారం దొరుకుతుంది . # RRR 🔥🌶️

* 11.05.2023
అమరావతి

రేపు (12.05.2023) సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ విజయవాడ, నెల్లూరు జిల్లా కావలి పర్యటన

విజయవాడలో అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో పాల్గొననున్న సీఎం, అనంతరం నెల్లూరు జిల్లా కావలిలో చుక్కల భూములను 22ఏ నిషేదిత జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కు కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం

విజయవాడ షెడ్యూల్‌

ఉదయం 8.25 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియం చేరుకుంటారు. అక్కడ రేపటి నుంచి ప్రారంభమయ్యే శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో పాల్గొంటారు, అనంతరం 9.35 గంటలకు తాడేపల్లి హెలీప్యాడ్‌కు చేరుకుని కావలి బయలుదేరుతారు.

కావలి షెడ్యూల్‌

ఉదయం 9.35 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.30 గంటలకు కావలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంకు చేరుకుంటారు. ఆ తర్వాత కావలి మినిస్టేడియంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని చుక్కల భూములను 22ఏ నిషేదిత జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కు కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం, అనంతరం అక్కడినుంచి బయలుదేరి సాయంత్రానికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

* పవన్‌ కల్యాణ్‌..

కనీసం 30-40 స్థానాలుంటేనే సీఎం అభ్యర్థిగా ఉంటామని అనగలం..

మా బలం మీదే ఆధారపడి సీట్ షేరింగ్ ఉంటుంది..
కొన్ని జిల్లాల్లో మా బలం ఎక్కువ..
కొన్ని జిల్లాల్లో తక్కువ..

జనసేనకు పట్టున్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీ చేస్తుంది

సీఎం కావాలనుకుంటే సీఎం అయిపోరు..

నన్ను సీఎంని చేయాలని టీడీపీనో బీజేపీనో అడగను..

నా సత్తా ఏంటో చూపించి అడుగుతాను- పవన్‌ కల్యాణ్‌..

*

విజయవాడ:

రేపటి నుంచి 17 వరకు శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం..

ఏపీ ప్రభుత్వం, దేవాదాయ శాఖలో అధ్వర్యంలో ఏర్పాట్లు..

రేపు ఉదయం యజ్ఞం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్..