DailyDose

హైదరాబాద్‌ టూ గోవా టూర్‌ ప్యాకేజీ.. తక్కువ ఖర్చుతో 4 రోజుల ట్రిప్‌

హైదరాబాద్‌ టూ గోవా టూర్‌ ప్యాకేజీ.. తక్కువ ఖర్చుతో 4 రోజుల ట్రిప్‌

సమ్మర్ హాలీడేస్‌లో సరాదాగా ఎక్కడినైనా వెళ్లాలని ప్లాన్‌ చేస్తున్నారా.? సమ్మర్‌లో బీచ్‌లను సందర్శించాలని చాలా మంది భావిస్తుంటారు. బీచ్‌లకు పెట్టింది పేరైన గోవాకు టూర్‌కి వెళ్లాలనుకునే వారి కోసం తెలంగాణ టూరిజం మంచి ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌ నుంచి గోవాకు 3 రాత్రులు, 4 రోజులతో కూడిన…

సమ్మర్ హాలీడేస్‌లో సరాదాగా ఎక్కడినైనా వెళ్లాలని ప్లాన్‌ చేస్తున్నారా.? సమ్మర్‌లో బీచ్‌లను సందర్శించాలని చాలా మంది భావిస్తుంటారు. బీచ్‌లకు పెట్టింది పేరైన గోవాకు టూర్‌కి వెళ్లాలనుకునే వారి కోసం తెలంగాణ టూరిజం మంచి ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌ నుంచి గోవాకు 3 రాత్రులు, 4 రోజులతో కూడిన స్పెషల్‌ ప్యాకేజీని అందిస్తోంది. ఇంతకీ ఈ ప్యాకేజీ ధర ఎంత.? టూర్‌లో భాగంగా ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.

తెలంగాణ టూరిజం అందిస్తోన్న ఈ ప్యాకేజీకి సంబంధించి ప్రతీ సోమవారం బుక్‌ చేసుకోవచ్చు. ప్రతీ సోమవారం హైదరాబాద్‌లోని హషీర్‌బాగ్‌ నుంచి గోవాకు బస్సు బయలుదేరుతుంది. టూర్‌ ప్యాకేజీలో భాగంగా మపుసా సిటీ, లార్డ్ బోడ్గేశ్వర్ టెంపుల్, ఫోర్ట్ అగ్వాడా, బాగా బీచ్, కలంగుట్ బీచ్, వాగేటర్ బీచ్ వంటి ప్రాంతాలను కవర్‌ చేస్తారు. 3 రాత్రులు, 4 రోజులు కొనసాగే ఈ టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు..

* మొదటి రోజు బషీర్‌బాగ్‌ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బస్సు ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రి ప్రయాణంలో భోజనం అందిస్తారు.

* అనంతరం మరునాడు ఉదయం 6 గంటలకు గోవాలోని కలంగుట్‌లో ఉండే హోటల్ బెవ్వన్ రిసార్ట్ చేరుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్‌ పూర్తి చేసుకున్న తర్వాత ఉదయం 10.00 గంటల నుంచి నార్త్ గోవాలోని మపుసా సిటీ, లార్డ్ బోడ్గేశ్వర్ టెంపుల్, ఫోర్ట్ అగ్వాడా, బాగా బీచ్‌ల సందర్శన ఉంటుంది. రాత్రి భోజనం, హోటల్‌లో బస ఉంటుంది.

* ఇక మూడో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన త‌ర్వాత‌ సౌత్ గోవాలోని డోనా పౌలా బీచ్, మిరామార్, పాత గోవా చర్చిలు, మంగూషి దేవాలయాలు, కొల్వా బీచ్, మార్డోల్ బీచ్ సందర్శన ఉంటుంది. ఇక సాయంత్రం క్రూట్‌ బోట్‌ జర్మీ ఉంటుంది. అయితే దీని ఖర్చులు వ్యక్తిగతంగా భరించాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి రూ. 500 టికెట్ ఉంటుంది.

* ఇన నాలుగో రోజు హోటల్ బెవ్వన్ రిసార్ట్ (కలంగుట్) నుంచి ఉదయం 11.00 గంటలకు బ‌స్సు బయలుదేరుతుంది. 5వ రోజు ఉదయం 6.00 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

ధర విషయానికొస్తే..
ఇక ఈ గోవ్‌ టూర్‌ ప్యాకేజీ ధర విషయానికొస్తే.. సింగిల్ షేరింగ్ కు రూ. 14, 900గా ఉంది. పెద్దవారికి ఒక్కరికి రూ. 9,900, చిన్నారుల‌కు రూ.7,920గా ఉంటుంది. బ‌స్సు టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లు టూర్‌ ప్యాకేజీలోనే కవర్‌ అవుతాయి. పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్‌ కోసం 9848540371 నంబ‌ర్‌ని సంప్రదించాల్సి ఉంటుంది.