ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస పెట్టి సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నారు. ఆయన చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ప్రతి ఒక్క సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)పై పవన్ అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. గబ్బర్ సింగ్ మ్యాజిక్ ను మరోసారి ఈ కాంబో రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా వీడియో గ్లింప్స్ వదిలారు. దీనిపై తాజాగా రామ్ చరణ్ రియాక్ట్ అయ్యాడు.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీన్ని రెండు పార్టులుగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది కాకుండా యంగ్ డైరెక్టర్ సుజీత్ తో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (OG) సినిమా కూడా చేస్తున్నారు పవన్ కల్యాణ్. అలాగే వినోదయ సీతం అనే రీమేక్ మూవీలో కూడా నటిస్తున్నారు. ఇవే కాకుండా పవన్ కల్యాణ్ చేస్తున్న మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
11 ఏళ్ల క్రితం హరీష్ శంకర్-పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. దీంతో ఇప్పుడు వీరి కాంబినేషన్ లో రెండోసారి వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై కూడా అలాగే అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లుగానే సినిమా ఉన్నట్లు ఇటీవల వదిలిన వీడియో గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య 70 ఎమ్ఎమ్ థియేటర్ లో అభిమానుల మధ్య రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉస్తాద్ భగత్ సింగ్ వీడియో గ్లింప్స్ పై రియాక్ట్ అయ్యాడు. “పవన్ కల్యాణ్ గారి ఈ మాసీవ్ గ్లింప్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి మాస్ ఎంటర్టైనర్ ను థియేటర్లలో చూసేందుకు వెయిట్ చేయడం నావల్ల కావట్లేదు. టీమ్ మొత్తానికి గుడ్ లక్” అని రామ్ చరణ్ రాసుకొస్తూ ట్వీట్ చేశాడు. కాగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. అశుతోష్ రానా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.