ఎందరో ప్రవాస తెలుగు వారి ఆప్త మిత్రులు సీనియర్ జర్నలిస్టు కిలారు ముద్దుకృష్ణ గారి హఠాన్మరణం దిగ్భ్రాంతికరం. ప్రవాసుల వార్తలను ప్రచురించటంలో వారు చూపిన చొరవ శ్లాఘనీయం. అమెరికాలోని మరియు వివిధ దేశాల లోని తెలుగు వారి వార్తలను నిరంతరం అందించటంలో ఆయన కృషి మరువేనిది.
ఆటా కార్యక్రమాలకు తను అందించిన సహకారం మరువలేనిది. ఆటా మహాసభల మరియు ఇతర సామాజిక కార్యక్రమాల వార్తలను వారు నిరంతరం ప్రచురించారు. అంతేకాక ఏలూరు లో రెండు సార్లు ఆటా సాంస్కృతిక కార్యక్రమాలు జరగడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పోయిన ఏడాది వాషింగ్టన్ డిసీ లో మరియు పూర్వం ఇతర నగరాలలో జరిగిన ఆటా మహాసభలలో కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. అన్ని తెలుగు సంఘాలలో అయన ఆప్త మిత్రులను సంపాదించుకున్నారు.
ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నవతరానికి వారు ఆదర్శప్రాయులు. వారి అకాల మరణంతో అమెరికా తెలుగు సంఘం ఒక మంచి మిత్రుడిని కోల్పోయింది., ప్రవాస తెలుగువారు గొప్ప పాత్రికేయుణ్ణి కోల్పోయారు. వారి అకాల మరణం మా అందరికి తీరని లోటు. ఆటా కార్యవర్గం, సంఘం సభ్యుల తరపున వారికి ఇదే మా శ్రద్ధాంజలి. వారి కుటుంబ సబ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం.
వారి కుమారుడు గోకుల్ కృష్ణ తమ తండ్రిగారి ప్రస్థానాన్ని కొనాసాగిస్తారని ఆశిస్తూ
శోకథప్త హృదాయలతో
“ఆటా కార్యవర్గం”