Health

యూరిక్ యాసిడ్ ను నిర్లక్ష్యం చేయవద్దు…

యూరిక్ యాసిడ్ ను నిర్లక్ష్యం చేయవద్దు…

జీవక్రియ లక్షణాలు, మద్యం సేవించడం, అధిక రక్తపోటు, మధుమేహం, ప్యూరిన్ డైట్ వంటి అనేక కారకాలు యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణమవుతాయి. యూరిక్ ఆమ్లం అనేది శరీరం నుండి బయటకు వేళ్ళే వ్యర్థ పదార్థాం. ఇది శరీరంలో నిరుపయోగమైన ద్రవం. సహాజంగా ప్యూరిన్ అనేది ఒక రసాయన పదార్థం, ఇది సహజంగా శరీరంలో. కొన్నిఆహారాలలో ఉంటుంది. శరీరం ప్యూరిన్‌ను వేసి యూరిక్ ఆమ్లంగా మారుస్తుంది. మూత్రపిండాలు దానిని రక్తం నుండి ఫిల్టర్ చేస్తాయి. ఇది శరీరం నుండి మూత్రం రూపంలో బయటకు వెళుతుంది. అయితే శరీరంలో యూరిక్ యాసిడ్ ఎప్పుడూ మితంగా ఉండాలి.

పెరిగితే చాలా రకాల సమస్యలు ఎదుర్కోవల్సివస్తుంది. ఇటీవలి కాలంలో ఈ సమస్య ఎక్కువగా కన్పిస్తోంది. ఆర్థరైటిస్ వంటి సమస్య పెరుగుతోంది. శరీరంలోంచి హానికారకమైన విష పదార్ధాలు బయటకు వెళ్లకపోతే యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంటుంది. జాయింట్స్ లో గౌట్ ఏర్పడి తీవ్రనొప్పికి కారణమౌతుంటుంది. అందుకే రోజూ డైట్‌లో కొన్ని పదార్ధాలు తప్పకుండా ఉండేట్టు చూసుకుంటే యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించవచ్చు. చెర్రీ..చాలామంది చెర్రీ ఫ్రూట్స్‌ను కేక్ లేదా డిష్ డెకరేషన్ కోసం వినియోగిస్తుంటారు.

కానీ చెర్రీస్ ఎంత రుచికరంగా ఉంటాయో అంతే ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. చెర్రీస్ క్రమం తప్పకుండా తీసుకుంటే యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. యూరిక్ యాసిడ్ కారణంగా తలెత్తే జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. టొమాటో.. టొమాటో అనేది ప్రతిరోజూ వంటల్లో తప్పకుండా ఉపయోగించే అద్భుతమైన ప్రయోజనాలు కలిగిన ఓ కూరగాయ. యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడంలో టొమాటో అద్భుతంగా పనిచేస్తుంది.

ఎందుకంటే టొమాటోలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. డార్క్ చాకొలేట్స్.. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించేందుకు డార్క్ చాకొలేట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే లిథోబ్రోమైన్ ఆల్కలాయిడ్ యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించేందుకు దోహదపడుతుంది. అయితే డార్క్ చాకొలేట్స్‌లో షుగర్ కంటెంట్ లేకుండా చూసుకోవాలి. ఆరెంజ్.. విటమిన్ సి సమృద్ధిగా లభించే ఆరెంజ్ క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గిపోతాయి.

రోజుకు 500 మిల్లిగ్రాముల విటమిన్ సి ఉన్న పదార్ధాలు తీసుకుంటే యూరిక్ యాసిడ్ సమస్యే తలెత్తదు. ఆరెంజ్‌తో పాటు నిమ్మ కూడా మంచి ప్రత్యామ్నాయం. ఫైబర్ ఫుడ్స్.. మరీ ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తినడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య తగ్గడమే కాకుండా బరువు కూడా తగ్గుతారు. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫైబర్ ఆధారిత ఫుడ్స్‌లో గ్రెయిన్స్, ఓట్స్, బ్రోకలీ, వాము, ఆనపకాయ వంటివి ఉన్నాయి.