ఎందరో ప్రవాస తెలుగు వారి ఆప్త మిత్రులుకు, శ్రీ కిలారు ముద్దుకృష్ణ గారి ఆకస్మిక మరణం ఎంతో బాధాకరం మరియు తెలుగు పత్రికా రంగానికి తీరని లోటు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సీనియర్ మోస్ట్ జర్నలిస్టు శ్రీ కిలారు ముద్దుకృష్ణ గారు వివిధ పత్రికల్లో పనిచేసి పాఠకుల మెప్పుపొందారు.ప్రతి కళాలోను కొంతమంది దిగ్గజాలు ఉంటారు. అలాగే జర్నలిస్ట్ అనగానే ముద్దుకృష్ణ గారు గుర్తు వచ్చేలా అభివృద్ధి చెందటం మనకు ఎంతో గర్వకారణం. ముద్దుకృష్ణ గారితో మనకి ఉన్న అనుబంధం వీడతీయలేనిది, ముద్దుకృష్ణ గారు నవతరానికి ఆదర్శప్రాయుులు, ఆయన ఎంతో మంది జీవితాలలో వెలుగును నింపిన ఉన్నత వ్యక్తి ,ఇంతటి గొప్ప వ్యక్తీ మన ఆంధ్ర రాష్ట్రానికి చెందినవాడు కావటం మనకి ఎంతో గర్వకారణం.
ఇంతటి మహానీడు మన మధ్య లేకపోవటం మనకి ఎంతో బాధాకరం. శ్రీ కిలారు ముద్దుకృష్ణ గారు ప్రత్యక్షంగా మన మధ్య లేకపోయినా పరోక్షంగా ప్రతి జర్నలిస్ట్ రూపం లో ఎప్పుడుకి అయన మన హృదయాల్లో ఎప్పటికీ చెరగని చిరంజీవిగా మిగిలి పోతారు. శ్రీ కిలారు ముద్దుకృష్ణ గారు ఆయన ఎంతో ఇష్టపడ్డ TNILIVE.COM మన మధ్య ఎప్పటికి చిరస్థాయిగా నిలిచి పోతుంది. దానిని వారి సుపుత్రుడు ముద్దుకృష్ణ గారి లాగానే కొనసాగించాలని, ముద్దుకృష్ణ గారికి సహకరించినట్లు వారి కుమారుడికి కూడా ప్రతి ఒక్కరు సహకరించలని కోరుకుంటున్నాము.
శ్రీ కిలారు ముద్దుకృష్ణ గారికి ఇదే మా శ్రద్ధాంజలి వారి ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటు, వారి మరణం పట్ల సంతాపం వ్యక్తంచేస్తు, వారి కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి తెలుపుతునము.
ఇట్లు
ఆయన అభిమానురాలు మరియు అసిస్టెంట్
( షేక్ తీహిరిణా బేగం)