ఒక వ్యక్తి లేదా జంతువు ప్రాణాలను కాపాడాల్సి వస్తే.. మీరు దేనిని ఎంచుకుంటారు..? అంటే చాలా మంది పెద్దలు మనిషిని కాపాడతామని చెప్పారు. కానీ చిన్నపిల్లలు మాత్రం జంతువును రక్షించడానికి ఇష్టపడతారని పోలాండ్ అధ్యయనం కనుగొంది. ఆరు నుంచి తొమ్మిది సంవత్సరాల చిన్నారులు మనుషుల కంటే కుక్క, పిల్లి, చింపాజీ వంటి యానిమల్స్‌ను కాపాడేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారని తెలిపారు శాస్త్రవేత్తలు. ఈ ప్రాజెక్ట్‌లో పిల్లలు, పెద్దలను రెండు పడవల్లోని ప్రయాణీకులు మునిగిపోతున్న ఊహాజనిత దృశ్యాలను పరిగణలోకి తీసుకోమని అడిగారు.
రెండు పడవలలో దేనిని సేవ్ చేస్తారో ఎంచుకోవాలని సూచించారు. మరింత ప్రత్యేకంగా అనేక సందిగ్ధతలలో పాల్గొనేవారిని ఒకటి, రెండు, 10, లేదా 100 మంది మానవులను లేదా ఒకటి, రెండు, 10, లేదా 100 జంతువులను (కుక్కలు లేదా పందులు) రక్షించాలని అడిగారు. ఈ క్రమంలో జంతువుల కంటే మానవులకు ప్రాధాన్యతనిచ్చే పెద్దల కంటే పిల్లలు బలహీనమైన ధోరణిని కలిగి ఉంటారని తేలింది. చిన్నపిల్లలు కుక్కకు, పిల్లలకి కలిగే హానిని సమానంగా భావిస్తారని గుర్తించింది. అందుకే ఒక వ్యక్తి కన్నా 100 జంతువులను రక్షించేందుకే మొగ్గుచూపారు.