రష్యా మళ్లీ అసాధారణ రీతిలో విరుచుకుపడింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై అర్థరాత్రి భీకర అటాక్ చేసింది. సోమవారం రాత్రి కీవ్‌పై పలు మిస్సైళ్లతో రష్యా దాడి(Missile Attack) చేసింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడినట్లు తెలుస్తోంది. రష్యా ప్రయోగించిన యూఏవీలను, ఇతర క్షిపణులను ఉక్రెయిన్ సమర్థవంతంగా ఢీకొట్టింది. రష్యాకు చెందిన దాదాపు 18 మిస్సైళ్లను ఉక్రెయిన్ వైమానిక దళం కూల్చివేసినట్లు కీవ్ మేయర్ విటాలీ క్లిచ్‌కో తెలిపారు.
కీవ్‌పై నాలుగు వైపుల నుంచి రష్యా అటాక్ చేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ వెల్లడించింది. 18 రకాల ఎయిర్, సీ, ల్యాండ్ మిస్సైళ్లను కూల్చివేసినట్లు జనరల్ వలేరి జాలుజ్నివి తెలిపారు. ఆ క్షిపణుల జాబితాను ఆయన రిలీజ్ చేశారు.
ఆరు కేహెచ్-47ఎం2 కింజాల్ ఏరోబాలిస్టిక్ మిస్సైళ్లను ఆరు మిగ్-31కే విమానాల నుంచి ఫైర్ చేసినట్లు ఆయన తెలిపారు. నల్లసముద్రంలోని నౌకల నుంచి 9 కాలిబర్ క్రూయిజ్ మిస్సైళ్లను రష్యా ప్రయోగించింది. ఎస్-400 ఇస్కాండర్-ఎం నుంచి మూడు ల్యాండ్ మిస్సైళ్లను కూడా రష్యా వదలినట్లు ఉక్రెయిన్ అధికారి చెప్పారు. రష్‌యా లాంచ్ చేసిన డ్రోన్లను కూడా ఉక్రెయిన్ దళాలు కూల్చినట్లు ఆయన తెలిపారు.
షాహిద్-136-131 డ్రోన్లతో రష్యా దాడి చేసిందని, అయితే అన్ని డ్రోన్లను నేలమట్టం చేసినట్లు జాలుజ్నివి తెలిపారు.