క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ ఐపీఎల్ లో ప్రవేశించిన విషయం తెలిసిందే. ముంబయి ఇండియన్స్ తరఫున ఈ సీజన్లో అరంగేట్రం చేసిన అర్జున్.. ప్రారంభంలో అందరి దృష్టి ఆకర్షించాడు. అయితే, గత కొన్ని మ్యాచ్‌ల్లో తుది జట్టులో లేకపోయినప్పటికీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తూ కనిపించాడు. అయితే ఈ రోజు ప్లేఆఫ్స్ రేసులో ముంబై – లక్నో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ముంబై ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ అందింది. ప్రాక్టిస్‌లో భాగంగా సహచరులతో మాట్లాడుతూ.. అర్జున్ టెండుల్కర్ కుక్క కరిచిందంటూ స్వయంగా వెల్లడించాడు
స్టేడియంలో లక్నో ఆటగాడు యుధ్వీర్తో అర్జున్ మాట్లాడుతూ తనకు కుక్క కరిచిన విషయాన్ని వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను లక్నో టీ ట్విటర్లో హ్యాండిల్ లో షేర్ చేయగా.. నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.