ప్రతి ఒక్కరి జీవితంలో చెట్లు అనేవి ఒక భాగమే. మనం పీల్చుకునే స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించాలి అన్న. M మనం వదిలే కార్బన్డయాక్సైడ్ పీల్చుకోవాలన్న అందుకు చెట్లు కావాలి. అంతేకాదు ఇక ఎన్ని ఏసీలు ఉన్న.. ఎన్ని ఫ్యాన్ లు ఉన్న ఎంతోమంది చెట్ల నీడలో చల్లటి గాలిలో కూర్చోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సిటీలో ఉండే ఎంతోమంది ఇక ఇలాంటి ప్రకృతిని ఆస్వాదించడానికి టూర్లకు వెళ్లడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక మన చుట్టూ పరిసరాలలో ప్రతి చోట చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇక గ్రామాల్లో చెట్లు పుట్టలు గుట్టలు అంటూ ఎక్కడ చూసినా పచ్చనైన ప్రకృతి దర్శనమిస్తూ ఉంటుంది.
అయితే ఇలా చెట్లు లేని పర్యావరణాన్ని ఊహించుకోవడం కూడా చాలా కష్టమే. కానీ ఒక్క చెట్టు కూడా లేని దేశాలు ఉన్నాయి అంటే నమ్ముతారా.. ఒక్క చెట్టు కూడా లేకుండా దేశాలు ఎలా ఉంటాయి అని అనుమానం ప్రతి ఒక్కరులో కలుగుతుంది. కానీ ఇక్కడ ఏకంగా రెండు దేశాలు ఒక్క చెట్టు కూడా లేకుండా ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి దేశాలలో మొదటిది గ్రీన్ ల్యాండ్. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆకుపచ్చని ప్రదేశాలు అందమైన గార్డెన్స్ దట్టమైన అడవులు.. పచ్చని ప్రకృతిని అందరూ ఊహించుకుంటారు. గ్రీన్ ల్యాండ్ పేరు వినగానే ఇవన్నీ ఊహించుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే.
ఎందుకంటే గ్రీన్ ల్యాండ్ లోని వేల మైళ్ళ భూమిలో ఒక్క చెట్టు కూడా లేదు అని చెప్పాలి. వృక్ష సంపద లేని దేశంలో గ్రీన్ ల్యాండ్ ఒకటిగా కొనసాగుతుంది. అయితే ఒక్క చెట్టు కూడా లేకుండానే ఆ దేశానికి గ్రీన్ ల్యాండ్ అని ఎందుకు పేరు వచ్చింది అని అనుమానం కలిగి ఉంటుంది. వాస్తవానికి ఈ దేశం మొత్తం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ఇక్కడ నివసించడానికి రారు. అందుకే ఈ దేశానికి గ్రీన్ ల్యాండ్ అని పేరు పెట్టారు. ప్రపంచంలో ఇలా చెట్లు లేని మరో దేశం ఖాతార్. ఇక్కడ చెట్లు లేకపోయినా అత్యంత సంపన్న దేశం గా కొనసాగుతుంది. ఈ దేశంలోని ఖాళీ స్థలంలో ఎక్కడ చూసినా ఎడారి మాత్రమే కనిపిస్తుంది. అయితే అక్కడి ప్రజలు దేశం పరిస్థితిని చూడలేక 40,000కు పైగా చెట్లతో మానవ నిర్మిత అడివిని తయారు చేస్తూ ఉండడం గమనార్హం.