Editorials

ఏమిటి భగవత్ తత్వం…

ఏమిటి భగవత్ తత్వం…

మంచివిలువలు పెంచుకుంటే
నేరచెరితలు కరిగిపోవా?
ప్రేమకర్ధం మార్చుకుంటే
అడ్డుగోడలు కరిగిపోవా?

సాటివాడిని కూలదోసే
పగటివేషం ఎన్నిరోజులు?
మనసుమనసుని కలుపుకుంటే
ద్వేషతరగలు కరిగిపోవా?

రానిదానికి రంకెలేస్తే
అసలురంగే బయటకొచ్చును
నిన్నునువ్వే మలుచుకుంటే
బ్రహ్మరాతలు కరిగిపోవా!

చిన్ననవ్వుని తిరిగిఇస్తే
సొమ్ములేవీ పోవునేస్తం
స్నేహహస్తం నువ్వుఇస్తే
మధ్యగీతలు కరిగిపోవా?

చూసికూడా చూడనట్టే
వెళ్ళిపోయే వాళ్ళుదండగ
మనిషితనమే పూలుపూస్తే
అన్నిబాధలు కరిగిపోవా!

పేదవాడికి గొడుగుపట్టే
నేతలెవ్వరు లేరుమనలో
స్వార్ధచింతనకొంత మానితె
వెతలజాడలు కరిగిపోవా?
ఇది కదా భగవత్ తత్వం