‘ఎయిరిండియాకు చెందిన బీ787-800 విమానం దిల్లీ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి బయలుదేరింది. విమానం గాల్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా భారీ ఒడిదొడుకులకు లోనయ్యింది. దీంతో అందులోని ప్రయాణికుల్లో ఏడుగురు తీవ్రంగా వణికిపోయారు. వెంటనే స్పందించిన విమాన సిబ్బంది.. అందులో ప్రయాణిస్తున్న ఓ వైద్యుడు, నర్సు సహాయంతో వారికి ప్రథమ చికిత్స చేశారు’ అని డీజీసీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది. విమానం సిడ్నీ ఎయిర్పోర్టుకు చేరుకోగానే వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారని తెలిపింది. అందులో ముగ్గురు వైద్య సహాయం తీసుకున్నారని.. మరెవరికీ ఆస్పత్రి చేరిక అవసరం కాలేదని సిడ్నీలోని ఎయిరిండియా మేనేజర్ పేర్కొన్నారు.