Agriculture

రైతులకు బిగ్ షాక్..

రైతులకు బిగ్ షాక్..

ఈ ఏడాది భారతదేశంలో రుతుపవనాలు రావడంలో 4 రోజులు ఆలస్యం అవుతుందని వార్తలు వస్తున్నాయి. వ్యవసాయ రంగానికి ఇది నిజంగా చేదు వార్త కాగా, మరో బిగ్ షాకింగ్ న్యూస్ సిద్ధంగా అవుతుంది. అవును.. రైతులపై ఎరువుల ధరల భారం పడనుంది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్‌లో ఎరువులపై సబ్సిడీని తగ్గించాలని నిర్ణయించారు. దాంతో రానున్న రోజుల్లో ఎరువుల ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ క్యాబినేట్ మీటింగ్‌లో ఎరువులపై సబ్సిడీ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. డీఏపీ, ఎంఓపీ వంటి ఎరువులపై న్యూట్రెండ్ ఆధారిత సబ్సిడీ(ఎన్‌బిఎస్) అందుబాటులో ఉంది. ఇందులో మొత్తం 35.36 శాతం తగ్గించారు. ఎరువులపై సబ్సిడీ కొత్త రేట్లు త్వరలో విడుదల కానున్నాయి.

పెరగనున్న ఎరువుల ధరలు..

ఎరువులపై కొత్త సబ్సిడీ రేట్ల గురించి ప్రభుత్వ వర్గాల నుంచి అనధికారిక సమాచారం వస్తోంది. దీని ప్రకారం.. రైతులపై ఎంత భారం పడనుందో ఇప్పుడు తెలుసుకుందాం.

నత్రజని కిలోకు రూ. 99.27 కి బదులుగా రూ.76.49 చొప్పున సబ్సిడీని పొందనున్నారు రైతులు. అంటే కిలోకు రూ. 22.78 అదనపు భారం రైతులపై పడనుంది.

అదేవిదంగా పొటాషియంపై సబ్సిడీ కిలోకు రూ.49.94కి బదులుగా రూ.41.03గా ఉంటుంది. అంటే కిలోకు రూ.8.91 భారాన్ని రైతులు భరించాల్సి ఉంటుంది.

ఫాస్ఫేట్‌పై గతంలో కిలోకు రూ.25.70గా ఉన్న సబ్సిడీ ఇప్పుడు రూ.15.91 అవుతుంది. అంటే రైతులపైనే రూ.9.79 భారం పడుతుంది.

సల్ఫర్‌కు కిలోకు రూ.2.84కి బదులుగా రూ.2.80 సబ్సిడీ ఉంటుంది. అంటే 4 పైసలు మాత్రమే రైతులు భరించాల్సి ఉంటుంది.