ఎందరో ప్రవాస తెలుగు వారికి ఆప్త మిత్రులు, సీనియర్ పాత్రికేయులు శ్రీ కిలారు ముద్దుకృష్ణ గారి ఆకస్మిక మరణం ఎంతో బాధాకరం మరియు తెలుగు పత్రికా రంగానికి తీరని లోటు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సీనియర్ మోస్ట్ జర్నలిస్టు శ్రీ కిలారు ముద్దుకృష్ణ గారు వివిధ పత్రికల్లో పనిచేసి పాఠకుల మెప్పుపొందారు
ముద్దుకృష్ణ గారితో తానాకి ఉన్న అనుబంధం వీడతీయలేనిది. అవకాశం ఉన్న ప్రతి తానా మహా సభలలో ముద్దుకృష్ణ గారు పాల్గొని సునిశిత విశ్లేషణ చేసేవారు.ఆయన మృతి పత్రికా రంగానికే కాక తానా కి కూడా తీరని లోటు.
ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఉత్తర అమెరికా తెలుగు సంఘము(తానా) ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తుంది.