Business

లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు…

లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు…

దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ఉన్నాయి. అమెరికా స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగిశాయి.దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా మొదలుపెట్టాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 156 పాయింట్ల లాభంతో 61,588 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 18,177 వద్ద కొనసాగుతోంది.

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​లో బీఎస్​ఈ సెన్సెక్స్​ 128 పాయింట్ల నష్టంతో 61,431 వద్ద ముగిసింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 51 పాయింట్లు కోల్పోయి 18,129 వద్ద స్థిరపడింది. బ్యాంక్​ నిఫ్టీ 53 పాయింట్లు పడి 43,752 వద్దకు చేరింది. ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 61,556- 18,186 వద్ద మొదలుపెట్టాయి

స్టాక్స్​ టు బై..

మారికో:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 524, టార్గెట్​ రూ. 545 రూ. 550

బర్జర్​ పెయింట్స్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 610, టార్గెట్​ రూ. 640- రూ. 650

లెమన్​ ట్రీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 85, టార్గెట్​ రూ. 110

లాభాలు.. నష్టాలు..

టెక్​ఎం, నెస్లే, ఎస్​బీఐ, యాక్సిస్​ బ్యాంక్​, ఇన్ఫీ, మారుతీ, ఐసీఐసీ బ్యాంక్​, ఐటీసీ, హెచ్​డీఎఫ్​సీ, విప్రో షేర్లు లాభాల్లో ఉన్నాయి.

హెచ్​యూఎల్​, ఎయిర్​టెల్​, రిలయన్స్​, ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి

అంతర్జాతీయ మార్కెట్​లు..

అమెరికా స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.34శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.94శాతం, నాస్​డాక్​ 1.51శాతం లాభపడ్డాయి.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ఉన్నాయి. ఎర్లీ ట్రేడ్​లో జపాన్​ నిక్కీ 0.63శాతం, ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200 0.23శాతం మేర లాభపడ్డాయి.

చమురు ధరలు..

చమురు ధరలు పడ్డాయి. బ్రెంట్​ క్రూడ్​ 87సెంట్లు పడి బ్యారెల్​కు 76.09డాలర్లకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 970.18కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 849.96కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు