భూమిని పోలిన గ్రహాలు ఈ విశాల విశ్వంలో ఎక్కడైనా ఉన్నాయో అని శాస్త్రవేత్తలు ఆరా తీస్తూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో భూమిలాంటి గ్రహాలతో పాటు భూమి కన్నా కొన్ని వందల రెట్లు పెద్దవిగా ఉంటే గ్రహాలను కూడా కనుగొన్నారు. సౌరవ్యవస్థ ఆవల ఉన్న గ్రహాల అణ్వేషణలో భాగంగా మరో కొత్త గ్రహాన్ని కనుగొన్నారు. దీనికి LP 791-18 d పేరు పెట్టారు. పరిమాణంలో భూమిలా ఉన్నా కూడా ఇది పూర్తిగా అగ్నిపర్వతాలతో కప్పబడి ఉందని గుర్తించారు.
ఈ ఎక్సోప్లానెట్ నాసా ప్లానెట్-హంటింగ్ ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్, రిటైర్డ్ స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా గుర్తించారు. ఇది మన సౌరవ్యవస్థలో అత్యంత చురకైన గురుడి ఉపగ్రహాల్లో ఒకటైన అయో మాదిరిగా ఉంది. అయో ఉపగ్రహం కూడా అగ్నిపర్వాతాల చర్యల వల్ల అత్యంత క్రియాశీలకంగా ఉంటుంది. ప్రస్తుత కనుగొన్న ఎక్సోప్లానెట్ LP 791-18 d దీని మాదిరిగానే ఉంది. ఇది భూమికి 90 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే కాంతి ఒక సెకన్ కు సుమారుగా 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఏడాాదిలో 9.5 ట్రిలియన్ కిలోమీటర్లు. ఈ వేగంతో ప్రయాణిస్తే ఆ గ్రహాన్ని చేరుకోవడానికి 90 ఏళ్లు పడుతుంది.
ఈ గ్రహం క్రేటర్ కాన్స్టులేషన్ లోని ఓ మరగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. భూమి కంటే 20 శాతం పెద్దదిగా ఉంది. LP 791-18 d పాటు మరో రెండు గ్రహాలు కూడా ఈ నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయి. ఈ గ్రహాలకు LP 791-18 d దగ్గర ఉండటంతో వాటి గురుత్వాకర్షణ శక్తి కూడా ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో ఈ గ్రహం కక్ష్య అండాకారంలో ఉంది. దీర్ఘవృత్తాకార కక్ష్య వల్ల ఈ గ్రహం అత్యధిక వేడిని, అగ్నిపర్వతాల చర్యలను కలిగి ఉంది.
ఈ గ్రహానికి ఎదురవుతున్న పరిస్థితులే గురు గ్రహ చంద్రుడైన అయోని ఇబ్బందిపెడుతున్నాయి. అయోపై గురుగ్రహంతో పాటు ఇతర పెద్ద చంద్రుల ప్రభావం ఉంది. వీటి మధ్య చిక్కుకుపోవడంతోనే అయో మోస్ట్ వయోలెంట్ ప్లానెట్ గా ఉంది. LP 791-18 d గ్రహం తనచుట్టూ తాను తిరగడం లేదని దీంతో ఒక వైపు పూర్తిగా కాంతి, మరోవైపు చీకటి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మన సౌరకుటుంబంలో భూమి, శుక్ర గ్రహాలు క్రియాశీలక అగ్నిపర్వతాలను కలిగి ఉన్నాయి.