DailyDose

కిరణాల నుండి వెలువడే శక్తి….

కిరణాల నుండి వెలువడే శక్తి….

🌳🌳🌳🌳🌳
ప్రతి రోజు సూరీడు కిరణం
విరిసే పుష్పం ఆనందం
మనుసుకు ఎంత హాహోనో
చీకటి వెలుగుకు
విప్పే కనులుకు!

గమ్యం కోసం ఆలోచన
మధురంగానే ప్రయాణం
ఆశ ఆశగా ఉండక
ఆనందంతో చేసే జీవనం
గమ్యం నీ..కోసం చేరును!!

తృప్తి అనేది హృదయానికి
కలిగితే
ఆత్మ అనేది అదుపులో
ఉండి
ఆనందం అనేది అందుకో..,

చీకటి కళ్ళు ఆరాటం
నిలకడలేని జీవనం
తృప్తి లేని ఆత్మ
ఆశల పోరాటంలో వెలుగు
చూడ లేనిది
మనిషి ఆనందం పొంద
లేనిది
జీవిత సత్యం తెలియక!!!!

చిరునవ్వు చిందిస్తూ.,వచ్చే
సూరీడు నవ్వు కొనలేని
ఆనందం మనుసు ఎంతో
హాయి హాయిగా నుండేను.,
ప్రతి రోజు వచ్చే కిరణం
వెలుగు
చిరునవ్వుతో స్వాగతించు
ఆనందం ఎక్కడికి పోయే..,
నిర్మలమైన మనుస్సు
ఆత్మనే వెలుగు చూపును
కొనలేని ఆనందం
కోటి నవ్వులు అందం….,
తెలుసుకో…ఆనందం!!!
&&&&&&&&&&&&