ఐరన్, విటమిన్ డి వంటి సూక్ష్మపోషకాల మాదిరిగా, కాల్షియం కూడా మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన ఖనిజంలో ఒకటి. శరీర ఎముకలు, కండరాలతో పాటు నాడీ వ్యవస్థ సరిగా పనిచేయడానికి కాల్షియం సహాయపడుతుంది. 90% కాల్షియం మన శరీరంలో ఎముకలు, దంతాలను బలంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇది శరీరంలోని ఎముకల నిర్మాణాన్ని సరిగా పనిచేసే సామర్థ్యాన్ని కలిగిస్తుంది. ఎముకలను బలోపేతం చేయడం. నరాలను చురుగ్గా ఉంచడంలో కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది.
90% కాల్షియం మన శరీరంలో ఎముకలు, దంతాలను బలంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇది శరీరంలోని ఎముకల నిర్మాణాన్ని సరిగా పనిచేసే సామర్థ్యాన్ని కలిగిస్తుంది. ఎముకలను బలోపేతం చేయడం. నరాలను చురుగ్గా ఉంచడంలో కాల్షియంది ప్రదానపాత్ర.
కావాల్సిన కాల్షియం పొందటం కోసం పాలు, జున్ను, పెరుగు క్రమం తప్పకుండా తీసుకుంటారు. అయితే పాల తాగాలంటే ఇష్టపడని వారు ఏం తినాలో తెలియక ఆందోళన చెందుతుంటారు. ఈ ఆహారాలలో కూడా పాలతో సమానమైన కాల్షియం ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఆహారాన్ని క్రమం తప్పకుండా తింటే కాల్షియం కోసం చింతించాల్సిన పని లేదు.
చియా గింజల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పాలలో కూడా లేనంతగా వీటితో లభిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల గింజల్లో 631 మి.గ్రా కాల్షియం ఉంటుంది.
క్యాల్షియం, ప్రొటీన్లు కలిసి రావాలంటే నట్స్ తినాలి. బాదంపప్పులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. స్వీట్ పొటాటోలో కూడా క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది.
పొద్దుతిరుగుడు విత్తనాలు కూడా శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పొద్దుతిరుగుడు గింజలను ప్రతిరోజూ ఉదయం తినడం వల్ల మీరు అనేక ప్రయోజనాలను పొందుతారు.
బ్రోకలీలో కూడా విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. అయితే ఏడాది పొడవునా అందుబాటులో ఉండదు. అందుబాటులో ఉన్నప్పుడు క్రమం తప్పకుండా తినడానికి ప్రయత్నించండి.