కింగ్ డమ్ గా పిలుచుకునే ఇంగ్లాండ్ కు ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధానికగా ఎంపిక అయిన విషయం తెలిసిందే. అప్పటి నుండి రిషి ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతున్నాడు. తాజాగా ఇతని వ్యక్తిగత సంపదకు సంబంధించిన విషయంలో షాక్ తగిలింది అని చెప్పాలి. సండే టైమ్స్ ప్రకటించిన వివరాల ప్రకారం రిషి సునాక్ మరియు ఆయన భార్య అక్షతా మూర్తి లు ఒక్క సంవత్సరంలో రెండు వేల కోట్ల రూపాయలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మాములుగా వీరు రాజకీయ రంగంలో ఉన్నప్పటికీ, వ్యాపారాలలో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అందుకే వీరి సంవత్సర ఆదాయంలో మార్పులు రావడం జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు వీరికి ఏ రంగంలో నష్టాలు వచ్చాయో లేదో తెలియదు
కానీ గత ఆర్ధిక సంవత్సరం వరకు తమకు ఉన్న సంపదతో పోలిస్తే ఈ ఆర్ధిక సంవత్సరం లో రూ. 2053 కోట్లు కోల్పోయినట్లు సండే టైమ్స్ పత్రిక తెలిపింది. కాగా ప్రస్తుతం వీరి సంపద 730 మిలియన్ ఫౌండ్ లుగా ఉంది. మరి వచ్చే ఆర్ధిక సంవత్సరానికి ఆ నష్టాన్ని పూడ్చుకుని లాభాలలో పయనిస్తారు చూడాలి