NRI-NRT

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీం….

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీం….

అన్ని వయసుల వారు ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదిస్తారు, ఇది చాలా తరచుగా వినియోగించబడే వేసవికాలపు డెజర్ట్‌గా మారుతుంది. ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను క్లెయిమ్ చేసే ప్రయత్నంలో, జపనీస్ ఐస్ క్రీమ్ కంపెనీ సెల్లాటో ఖరీదైన మరియు అరుదైన పదార్థాలను ఉపయోగించి చాలా ప్రత్యేకమైన డెజర్ట్‌ను రూపొందించింది.

ఈ ఐస్‌క్రీమ్‌ ధర అక్షరాలా దాదాపు రూ. 5.2 లక్షలు. ఆ ఐస్‌క్రీమ్‌లో అంత స్పెషల్‌ ఏముంది అని ఆశ్చర్యపోతున్నారా? అదేంటో మీరే చదివేయండి..జపాన్‌కు చెందిన ప్రముఖ ఐస్‌క్రీమ్‌ బ్రాండ్‌ సెలాటో  ఓ ప్రత్యేకమైన ఐస్‌క్రీమ్‌  వెరైటీని తయారుచేసింది. అత్యంత అరుదుగా దొరికే పదార్థాలతో కలిపి చేసిన ఈ డెజర్ట్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా సరికొత్త రికార్డు సాధించింది. ఈ ప్రత్యేక ఐస్‌క్రీమ్‌ను 8,73,400 జపనీస్‌ యెన్‌ (భారత కరెన్సీలో దాదాపు రూ.5.2లక్షలు)ల చొప్పున విక్రయిస్తోంది. దీని తయారీలో ఉపయోగించిన వైట్‌ ట్రఫుల్‌ అనే అరుదైన పదార్థాన్ని ఇటలీలోని ఆల్బా నుంచి తెప్పించింది. ఈ ట్రఫుల్‌ ధర కిలోకు 2 మిలియన్‌ జపనీస్‌ యెన్‌లు ఉంటుందట. ఆల్బాలో మాత్రమే దొరికే దీని సువాసన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీనివల్లే ఈ ఐస్‌క్రీమ్‌ ధర ఇంతగా ఉందట. దీంతో పాటు పర్మిజియానో రెగ్గియానో అనే చీజ్‌, సేక్ లీస్ అనే వైట్‌ సాస్‌ వంటి పదార్థాలు కూడా ఇందులో వాడారు.

దీంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌గా ఈ డెజర్ట్‌ గిన్నిస్‌ రికార్డు  సాధించింది. అయితే కేవలం ఖరీదైన ఐస్‌క్రీమ్‌ ను తయారు చేయడమే గాక.. యూరోపియన్, జపనీస్ పదార్థాలను కలిపి ఓ కొత్త వంటకాన్ని రూపొందించడమే తమ లక్ష్యమని సెలాటో సంస్థ చెబుతోంది. దీన్ని తయారు చేయడానికి ఒసాకాలోని ప్రముఖ ఫ్యూజన్ రెస్టారెంట్ రివీలో పనిచేసే ప్రధాన చెఫ్ తడయోషి యమడను ప్రత్యేకంగా నియమించుకుంది. సెల్లాటో నియమించుకున్నాడు. దీన్ని తయారు చేసేందుకు ఏడాదిన్నర పాటు కష్టపడినట్లు సెలాటో ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎన్నోసార్లు విఫలమైన తర్వాత ఈ అమోఘమైన రుచిని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. దీని రుచిని తెలుసుకునేందుకు సంస్థలో టేస్టింగ్‌ సెషన్లు కూడా ఏర్పాటు చేశారట. తయారుచేసిన ప్రతిసారీ సిబ్బందికి రుచి చూపించి అభిప్రాయాలు సేకరించారట. ఏదేమైనా.. ఈ ఐస్‌క్రీమ్‌ చాలా కాస్ట్‌లీ గురూ..!