* లేడీ సింగం మృతిపై అనుమానాలు..
జున్మోని రభాను హత్య చేశారా?రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అస్సాం లేడీ సింగంగా పేరు తెచ్చుకున్న ఎస్సై జున్మోని రఖా కేసు అనేక మలుపులు తిరుగుతోంది. తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ పోస్టుమార్టం రిపోర్టు తాజాగా రభా వెలువడటంతో కొత్తకోణం బయటపడింది. జున్మోని శరీరంపై అనేక గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో వెల్లడైంది. రెండు వైపుల అనే పక్కటెముకలకు ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు. అంతేగాక బ్రెయిన్ హెమరేజ్, కార్డియాక్ అరెస్ట్ కారణంగా జున్మోని రభా మరణించారని కూడా ఈ నివేదికలో వెల్లడైంది. ఆమె రెండు మోకాళ్లు, కాళ్లు మోచేతి, చేతులపై గాయాలు గుర్తులు కనిపించినట్లు తేలింది.
* హైదరాబాద్ సీబీఐటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…
హైదరాబాద్ లోని సీబీఐటీ కళాశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.
* పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం..
పసిఫిక్ మహాసముద్రంలోని న్యూ కలెడోనియాకు తూర్పున రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా ప్రాణనష్టం లేదా భౌతిక నష్టాలు జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు. ద్వీప దేశంలోని ఓడరేవు పట్టణమైన లెనాకెల్ నుండి 1.5 అడుగుల కంటే తక్కువ అలలు ఎగిసిపడుతున్నాయని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. భూకంప కేంద్రం న్యూ కాలెడోనియా పసిఫిక్ యొక్క రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉంది. ఇక్కడ టెక్టోనిక్ ప్లేట్లు కలుస్తాయి. దీని ఘర్షణ తీవ్రమైన భూకంప, అగ్నిపర్వత కార్యకలాపాలకు దారితీస్తుంది.
* తెలంగాణలో వీధికుక్కల దాడికి మరో బాలుడు బలి..
తెలంగాణలో వీధికుక్కల దాడుల్లో మరణిస్తున్న విషాదకర ఘటనలు ఇంకా జరుగుతున్నాయి. వీధికుక్కలు దాడుల్లో పలువురు మరణిస్తే మరికొంతమంది ఆసుపత్రి పాలవుతున్నారు. గతంలో అంబర్ పేటలో వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటన మరవకముందే తాజాగా హన్మకొండలో వీధికుక్కల దాడికి మరో బాలుడు ప్రాణాలు విడిచాడు. అప్పటివరకు ఆడుకుంటున్న ఆ బాలుడిపై కుక్కలు దాడి చేసి చంపేశాయి. దీనితో అన్నా లే అన్న అంటూ బాలుని సోదరి రోదన ప్రతీ ఒక్కరిచేత కంటతడి పెట్టిస్తుంది. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాధచాయలు అలముకున్నాయి.
* కారులో వెళ్తూ బుల్డోజర్ను ఢీకొట్టిన మాజీ మంత్రి..
గాంధీనగర్: గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ మాజీ నేత వల్లభ్‌బాయ్ వఘాసియా(69) రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న కారు బుల్‌డోజర్‌ను ఢీకొట్టడంతో దుర్మరణం చెందారు. కారును ఆయనే స్వయంగా డ్రైవ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వఘాసియాతో పాటు కారులో ఉన్న మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
* లారీ కిందకు దూసుకెళ్లిన కారు..
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంతో వస్తున్న ఓ కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.
* ప్రకాశం జిల్లాలో వివాహిత దారుణ హత్య..
ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు శివారులో గత రాత్రి దారుణ హత్య జరిగింది. ఓ వివాహితను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. తమ కుమార్తె కోట రాధ (35) కనిపించడం లేదంటూ ఆమె తండ్రి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆమె మృతదేహం జిల్లెళ్లపాడు సమీపంలో రోడ్డు పక్కన లభ్యమైంది.రూ. 50 లక్షలు అప్పు తీసుకున్న వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారన్న బాధితురాలి తండ్రి.
* తల్లిదండ్రులు, నానమ్మను హత్య చేసి.. కనిపించట్లేదని కట్టుకథలు
ఛత్తీస్గఢ్లో ఓ యువకుడు.. తన తల్లిదండ్రులు, నానమ్మను చంపేసి పోలీసులకు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. వారు ముగ్గురు ఆస్పత్రికి వెళ్లి తిరిగి రాలేదని చెప్పాడు. చివరకు అసలు నిజం బయటపడి కటాకటాలపాలయ్యాడు. మహాసముంద్ జిల్లాలోని పుట్కా గ్రామానికి చెందిన ప్రభాత్ భోయ్, అతడి భార్య జర్నా భోయ్, ప్రభాత్ తల్లి సులోచన కనిపించడం లేదని ప్రభాత్ కుమారుడు ఉదిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
* ఆరున్నర కిలోల గంజాయి స్వాధీనం..
మూసాపేట: గంజాయి అమ్మేందుకు యత్నిస్తున్న ఇద్దరు యువకులను కూకట్పల్లి, బాలానగర్ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డికి చెందిన ఇద్దరు స్నేహితులు బిజ్జ వికాస్(25), గంట రాకేశ్(26) కొంతకాలంగా ఏపీలోని అరకు నుంచి గంజాయి తీసుకువచ్చి సిటీలో అమ్ముతున్నారు.
* భార్యకు కరెంట్ షాక్ పెట్టి చంపాడు..
చాలామంది కేవలం అవసరాన్ని బట్టి మాత్రమే మద్యం తీసుకుంటూ ఉంటే.. ఇంకొంతమంది మాత్రం ఇక మద్యం తాగడం కోసమే పుట్టారేమో అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక ప్రతిరోజు మద్యం తాగుతూ చివరికి సొంత వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా ఫుల్లుగా మద్యం తాగి మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్న వారు చాలామంది కనిపిస్తున్నారు. ఇక్కడ ఒక కసాయి భర్త అయితే మరింత దారుణానికి పాల్పడ్డాడు. మద్యం తాగొద్దు ఆరోగ్యం పాడవుతుంది కుటుంబ బాధ్యతలు చూసుకో అని మంచి చెప్పిన భార్యని దారుణంగా హత్య చేశాడు భర్త.ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో వెలుగులోకి వచ్చింది. భర్తను మద్యం తాగొద్దు అని మంచి మాటలు చెప్పడమే ఆ భార్య పాలిట శాపంగా మారిపోయింది.
* శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి ఓ ప్రయాణికుడి వద్ద 1,761 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 1.10 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలించిన నిందితుడిని కేరళకు చెందిన వ్యక్తిగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. నిందితుడిని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు