DailyDose

TNI తాజా వార్తలు..పులివెందుల బయల్దేరిన అవినాశ్…. తదితర విశేషాలు.

TNI తాజా వార్తలు..పులివెందుల బయల్దేరిన అవినాశ్…. తదితర విశేషాలు.

అమ్మకు బాగాలేదు … ఈరోజు సీబీఐ విచారణకు రాలేను ||

▪️ఈరోజు కూడా సీబీఐ విచారణకు రాకుండా దూరంగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి.

▪️తల్లి అనారోగ్యంగా ఉందంటూ హైదరాబాద్ నుండి పులివెందుల బయల్దేరిన అవినాష్.

గుండెపోటు వచ్చిందని, ఆమెను పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చించారని పేర్కొన్నారు. అందుకే తాను పులివెందుల వెళ్తున్నానని, విచారణకు రాలేనని తెలిపారు.

నేడు కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటన…

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్… జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ చేశారు. ఇందులో భాగంగానే ఈ రోజు మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. నాందేడ్ లో శిక్షణ తరగతులలో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్. ఈ మేరకు అధికారులు, పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.

నా నమ్మకమే వాలంటీర్లు అంటున్న జగన్….

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ సారథులు వాలంటీర్లు అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలో నిర్వహించిన మూడో ఏడాది ‘వలంటీర్లకు వందనం’ కార్యక్రమాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… వాలంటీర్ల వ్యవస్థ ఓ మహాసైన్యమన్నారు. జగన్ పెట్టుకున్న నమ్మకమే వాలంటీర్లు అన్నారు. ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తున్న వ్యవస్థను.. గత ప్రభుత్వంలో ఏనాడైనా చూశారా ?అని ప్రజల్ని ప్రశ్నించారు. 64లక్షల మంది లబ్దిదారులకు ప్రభుత్వ పెన్షన్లను అందిస్తున్న గొప్ప సేవకులు, సైనికులని వాలంటీర్లను కొనియాడారు. 2019నుంచి 2.66లక్షల మంది మహా సైన్యం వ్యవస్థ ప్రజలకు సేవలు అందిస్తోందని చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా వాలంటీర్ల ద్వారా ప్రజలకు మంచిని అందించే కార్యక్రమం వాలంటీర్ల నిర్వహిస్తున్నారని చెప్పారు.

* కర్ణాటక కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ ఆహ్వానించారు. ఈ మేరకు సిద్ధరామయ్యకు లేఖ రాశారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని సిద్ధరామయ్యకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు.సోనియా, రాహుల్, స్టాలిన్, నితీష్ కుమార్, మమతా బెనర్జీకి ఆహ్వానం.

*  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రెస్ మీట్…

తాను భాజపాను వీడనని, పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలు దుష్ప్రచారంలో భాగమని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెలిపారు.

ఇదే ది బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ బీఎస్ఎన్ఎల్…

ప్రభుత్వ రంగ టెలీకం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇటీవల కొత్త కొత్త ఆఫర్లు ప్రకటిస్తోంది. అందరినీ ఆకట్టుకునేందుకు వివిధ రకాల ప్లాన్స్ ప్రవేశపెడుతోంది. ఇప్పుడు లాంగ్ టైమ్ వ్యాలిడిటీని అతిత తక్కువ ధరకే అందిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..

కేవలం ఎక్కువ వ్యాలిడిటీ మాత్రమే చూస్తుంటే ఇదే ది బెస్ట్ రీఛార్జ్ ప్లాన్. 22 రూపాయల ఈ ప్లాన్‌లో వ్యాలిడిటీ ఎంతో వింటే ఆశ్చర్యపోతారు. ఏకంగా 90 రోజుల కాల వ్యవధిని అందిస్తోంది బీఎస్ఎన్ఎల్. కేవలం 22 రూపాయలకు ఇన్ని రోజుల వ్యాలిడిటీ ఆశ్చర్యమే మరి. ఖరీదైన రీఛార్జ్ ప్లాన్స్ కూడా ఏవీ 90 రోజుల వ్యాలిడిటీ అందించడం లేదు. 700-800 రూపాయలు వసూలు చేసి కూడా 84 రోజుల వ్యాలిడిటీ మాత్రమే అందిస్తున్నారు. అలాంటిది 22 రూపాయలకు 90 రోజుల వ్యాలిడిటీ అంటే ఊహించని ఆఫర్ ఇది..

ఇమ్రాన్‌ఖాన్‌కు బెయిల్ మంజూరు

లాహోర్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు జూన్ 2 వరకు రెండు కేసులలో బెయిల్ మంజూరు చేసింది. జిన్నా హౌజ్ విధ్వంసం కేసు, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) కార్యకర్త జిల్లే షా హత్య కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ లభించింది. జూన్ 2 వరకు రెండు కేసుల్లో పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ లభించింది. ఇమ్రాన్ ఖాన్ తన న్యాయవాది, బారిస్టర్ సల్మాన్ సఫ్దర్ ద్వారా ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇమ్రాన్‌పై “నిరాధారమైన కేసు” నమోదైందని పిటిషన్‌లో న్యాయవాది పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రతీకార రాజకీయాల బాధితుడని, రాజకీయ కారణాలతో ఒంటరిగా ఉన్నారని పిటిషన్‌లో తెలిపారు. శాంతి భద్రతల దృష్ట్యా జిల్లే షా హత్య కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు పాక్ యాంటీ టెర్రరిజం కోర్టు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితి..

తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకూ ఉపరితల ద్రోణి
ఫలితంగా, దక్షిణ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో నేడు, రేపు తేలికపాటి వర్షాలు
గురువారం నల్గొండలో గరిష్ఠంగా 44.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత
ఏపీలోని ఎస్‌పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కసుమూరులో గరిష్ఠంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత

ప్రయాణికులకు అలర్ట్…

తెలుగు రాష్ట్రాల్లో మే 21న 17 రైళ్లు రద్ద చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైల్వే అభివృద్ధి పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 21న 17 రైళ్లను రద్దు చేస్తున్నమని, ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు తమ ప్రకటనలో పేర్కొన్నారు.

చంద్రబాబు కి సజ్జల దిమ్మ తిరిగే సవాల్..

చంద్రబాబుకు బహిరంగ సవాల్‌ విసిరారు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఆర్ 5 జోన్ లే అవుట్ లలో ప్రభుత్వ సలహాదారు సజ్జల ఈ రోజు పర్యటించారు.. నవులూరు, కృష్ణాయపాలెంలో లేఅవుట్లను పరిశీలించారు.. అయితే, కృష్ణాయపాలెంలో అమరావతి రైతుల నినాదాలు చేశారు.. సజ్జల కాన్వాయ్ వెళుతున్న సమయంలో ఆర్ 5 జోన్ వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు అమరావతి రైతులు.. తన పర్యటన తర్వాత మీడియాతో మాట్లాడిన సజ్జల.. లే అవుట్ల అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు.. ప్రైవేటు లే అవుట్లు కూడా ఇంత చక్కగా ఉండవని ప్రశసించారు.. లేఅవుట్లలో 62 శాతం రోడ్లు, ఓపెన్ స్పేస్ గా వదిలాం.. ఇంటర్నల్ రోడ్ల కోసం 36 శాతం భూమి కేటాయించామని.. స్లమ్స్ అని ఎలా అంటారు? అని నిలదీశారు.. మొత్తం స్థలంలో 38 శాతం మాత్రమే ప్లాటింగ్ చేశాం అని వెల్లడించారు.. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబుకు చాలెంజ్‌ విసిరారు సజ్జల.. చంద్రబాబు తన హయాంలో ఎక్కడ భూమి ఇచ్చాడో చెప్పాలన్న ఆయన.. ఒక సెంటు ఇచ్చినా చూపించమని అడుగుతున్నాం.. చూపిస్తే స్వయంగా క్షమాపణ చెబుతాం.. చూపించలేకపోతే.. నేను అబద్దాలు చెప్పానని చంద్రబాబు ఓపెన్ గా అంగీకరించాలి అని సవాల్‌ చేశారు.. చంద్రబాబు రాజకీయంలో పేదలకు చోటు ఉండదన్న సజ్జల.. చంద్రబాబు దిక్కుమాలిన లెక్కలు వేసుకోవటం వల్లే ప్రజలు తిరస్కరించారన్నారు.. చంద్రబాబు చెప్పినట్లు ఇవి స్లమ్ లు, శ్మశానలు అయితే లబ్దిదారులు టీడీపీకే మద్దతు ఇస్తారు కదా? మరి ఎందుకు భయపడటం? అంటూ ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.