Politics

కామన్ సింబల్ కోసం పోరాటం పవన్ సాధించేనా..

కామన్ సింబల్ కోసం పోరాటం  పవన్ సాధించేనా..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్న జనసేన పార్టీకి ఇప్పుడు కొత్తగా ఒక ఇబ్బంది వచ్చి పడింది .ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే సింబల్ గాజు గ్లాసు గుర్తు ఆ పార్టీ నుంచి చేజారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.గత ఎన్నికల్లో కామన్ సింబల్గా గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేసిన జనసేన కేవలం ఒక ఎమ్మెల్యే సీటుతోనే సరిపెట్టుకుంది .దాంతో ఆ సింబల్ ను శాశ్వత గుర్తుగా పొందడంలో విఫలమైంది.

వచ్చే 2024 ఎన్నికలలో కూడా ఆ పార్టీ టిడిపితో పొత్తు( TDP ) పెట్టుకుంటుందని స్పష్టమైనందున పూర్తి నియోజకవర్గాల్లో ఆ సింబల్ ను పొందటం ఆ పార్టీకి కష్ట సాధ్యంగా మారింది .నిబందనల ప్రకారం ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేసే నియోజక వర్గాలలో వారికి గాజు గ్లాసు కేటాయించే ఈసీ, ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో లేని మిగతా చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఈ గుర్తును కేటాయించే అవకాశం ఉంది.అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అధికార పార్టీ ఓట్లు చీల్చే ప్రయత్నం మొదలు పెడుతుందా? డమ్మీ అభ్యర్థులను నిలబెట్టి వారికి గాజు గ్లాసు గుర్తు వచ్చేలా చూసి ఓటర్లను గందరగోళం చేసే ప్రయత్నం చేస్తారని జనసేనకు టెన్షన్ గా ఉన్నట్టు సమాచారం

పోనీ ఈ గుర్తును పక్కనపెట్టి కొత్త గుర్తును తీసుకొని బాగానే ఉన్న సమయం ఉన్నందున ప్రచారం చేసుకొని ఆ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆలోచన కూడా ఉందని అయితే ప్రజల్లో ఒక సెంటిమెంట్ లాగా ఈ గుర్తును ప్రచారం చేసుకున్న తర్వాత దీనిని వదిలిపెడితే అనేక ఇబ్బందులు ఎదురవుతాయని ,తాము వదులుకుంటే చాలా చోట్ల ఈ గుర్తును పెట్టు కుని స్వతంత్ర అభ్యర్ధులు తమ వోట్ల కు గండి పెట్టే అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తుంది.ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలా అనిజనసెన లో తీవ్ర స్థాయి ఆలోచనలు జరుగుతున్నాయని తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఈసీ ని రిక్వెస్ట్ చేసి ఈ సింబల్ ని మిగతా అభ్యర్థులు ఎవరికీ కేటాయించకుండా చూసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా అది ఎంత మేరకు సఫలం అవుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రస్తుతం జనసేన ఉందనివార్తలు వస్తున్నాయి