బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson) మరోసారి తండ్రి కాబోతున్నారు. ఇప్పటికే ఆయనకు ఏడుగురు పిల్లలు ఉండగా.. 58 ఏళ్ల వయస్సులో మరోసారి తండ్రి అవ్వబోతున్నారు. త్వరలో తన మూడో భార్య క్యారీ సిమండ్స్ (carrie symonds) పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. 2021 మేలో బోరిస్, క్యారీ సిమండ్స్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. అంతకముందు కొన్నేళ్ల పాటు సహజీనవం కూడా చేశారు. ఆ సమయంలోనే వారికి ఒక కొడుకు జన్మించాడు.
వారికి వివాహం జరిగిన తర్వాత మరో కొడుకు జన్మించాడు. తాజాగా తాను మరోసారి తల్లిని కాబోతున్నానని తెలియజేస్తూ క్యారీ సిమండ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇద్దరు పిల్లలతో కూడిన ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరలవుతోంది.
ఇకపోతే 1987లో బోరిస్ జాన్సన్ మొదటిసారి జర్నలిస్టు అలెగ్రా మోస్టిన్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారి మధ్య విబేధాలు రావడంతో 1993లో విడాకులు తీసుకొని విడిపోయారు. అలెగ్రాతో విడిపోయిన కొద్దిరోజులకే బోరిస్ భారత సంతతికి చెందిన న్యాయవాది మెరీనా వీలర్‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత 2018లో వారిద్దరు కూడా విడాకులు తీసుకొని ఎవరిదారి వారు చేసుకున్నారు. ఆ తర్వాత ఆర్ట్ కన్సల్టెంట్ హెలెన్ మాకిన్‌టైర్ ఎఫైర్ కారణంగా బోరిస్ జాన్సన్‌కు మరో బిడ్డ కూడా ఉన్నాడు. మెరీనా వీలర్‌తో విడిపోయిన తర్వాత కొంతకాలంగా క్యారీ సిమండ్స్‌తో డేటింగ్ చేసిన బోరిస్ 2021లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు.