ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు భారత్-ఆస్ట్రేలియా అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్లో విన్నింగ్ ఛాన్స్ ఎక్కువగా ఎవరికి ఉందో పాంటింగ్ చెప్పేశారు. లండన్ ఓవల్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
జూన్ 7న భారత్-ఆస్ట్రేలియా మధ్య ప్రారంభం కానున్న WTC ఫైనల్లో ఆసీస్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు. లండన్‌లోని ఓవల్ గ్రౌండ్, పిచ్ ఆసీస్ తరహాలోనే ఉంటుందని తెలిపారు. ఇదే మ్యాచ్ భారత్‌లో జరిగితే కచ్చితంగా టీమిండియానే విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. 2000 దశకంతో పోల్చితే విదేశీ గడ్డపై కూడా ప్రస్తుతం భారత్ అద్భుతంగా ఆడుతోందని చెప్పారు.
జూన్ 7 లండన్ ఓవల్ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్-ఆస్ట్రేలియా ఈ తుదిపోరులో పోటీ పడనున్నాయి. ఇప్పటికే గత డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచిన భారత్.. ఈ సారి మాత్రం టెస్టు ఛాంపియన్షిప్ కిరీటాన్ని సొంతం చేసుకోవాలని చూస్తోంది