DailyDose

TNI తాజా వార్తలు….

TNI తాజా వార్తలు….

*  హూస్టన్‌లో మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం..

అలియంట్‌ హెడ్‌ క్వార్టర్స్‌ను సందర్శించిన కేటీఆర్‌

హైదరాబాద్‌లో అలియంట్‌ గ్రూప్‌ విస్తరణ

కొత్తగా మరో 9000 మందికి ఉద్యోగ అవకాశాలు

అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కావాలని CBI నోటీసులు

దీంతో ఈ నెల 19న విచారణకు రావాలంటూ అధికారులు నోటీసులు పంపారు. అయితే, అవినాశ్ రెడ్డి తల్లికి అనారోగ్యానికి గురవడంతో శుక్రవారం ఆమెను ఆసుపత్రికి తరలించారు. దీంతో శుక్రవారం కూడా అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు శనివారం మరోమారు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22న (సోమవారం) హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని అందులో సూచించారు.

 కర్ణాటక చేరుకున్న రాహుల్ ప్రియాంక

శ్రీ రాహుల్ గాంధీ మరియు శ్రీమతి అందుకున్నారు. ప్రియాంక గాంధీ ఈరోజు విమానాశ్రయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నారు.

బెంగళూరుకు వచ్చిన కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ స్వాగతం పలికారు.

కొత్తగా ఎన్నికైన కర్ణాటక ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు వారు ఇక్కడికి వచ్చారు.

సిద్ధరామయ్య అనే నేను.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం..

నేడు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మధ్యాహ్నం 12.30 గంటలకు కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం..

డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్న డీకే శివకుమార్..

వారితో పాటు మంత్రులుగా 8 మంది ప్రమాణం..

ఈ కార్యక్రమానికి హాజరవుతున్న సోనియా, రాహుల్, ప్రియాంక, 7 రాష్ట్రాల సీఎంలు

కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండోసారి సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం, డిప్యూటీ సీఎంగా డి.కె శివకుమార్ ప్రమాణస్వీకారం – ప్రమాణం చేయించిన కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ – ప్రమాణ స్వీకారానికి హాజరైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, బిహార్ సీఎం నితీశ్, తమిళనాడు సీఎం స్టాలిన్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, కమల్ నాథ్ , సీతారం ఏచూరి, డి.రాజా, తేజస్వీ యాదవ్, మెహబూబా, ముఫ్తీ, శివరాజ్ కుమార్, కమలహాసన్.

ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలకు జూనియర్‌ ఎన్టీఆర్‌ దూరం..

అధికారిక సమాచారం -మే 20వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు కార్యక్రమానికి శ్రీజూనియర్ ఎన్టీఆర్ గారు 40వ జన్మదినోత్సవం జరుపుకోవడంతో కుటుంబ సభ్యుల ముందస్తు కట్టుబాట్ల వల్ల హాజరు కాలేకపోతున్నారని తెలియజేసేందుకు చింతిస్తున్నాము. ఆహ్వాన సమయంలో ఆర్గనైజింగ్ కమిటీకి ఇదే విషయాన్ని తెలియజేసింది.

2,000 నోట్ల డిపాజిట్ కోసం క్యూ కడుతున్న ప్రజలు…

ఏటీఎం కేంద్రాల వద్ద డిపాజిట్ యంత్రాల్లో జమకు ఆసక్తి,బ్యాంకు శాఖల్లో డిపాజిట్ కోసం వస్తున్న ప్రజలు,సాధారణ రోజులతో పోలిస్తే పెరిగిన రద్దీ.

2016లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన సమయంలో రూ.2,000నోటును ప్రవేశపెట్టారు. వ్యవస్థలో 90 శాతం నగదు చట్టబద్ధమైన చెల్లుబాటును రద్దు చేయడంతో, కరెన్సీ కొరతను అధిగమించేందుకు ఆర్ బీఐ అప్పట్లో రూ.2,000ను ప్రవేశపెట్టింది. నాడు నోట్ల రద్దుతో ప్రజలు, చిన్న పరిశ్రమలు నానా ఇబ్బందులు పడ్డాయి. కానీ, నేడు కరెన్సీ వినియోగం పెద్దగా లేకపోవడం, కొంత కాలంగా రూ.2,000 నోట్లను పంపిణీ చేయడకపోవడం తదితర అంశాలతో ఈ విడత సామాన్యుడికి పెద్దగా అగచాట్లు ఉండకపోవచ్చు. బ్యాంకు శాఖల్లో ఈ నెల 23 నుంచే రూ.2,000 నోట్లను మార్చుకోవడానికి ఉంటుంది.

ఇమ్రాన్ ఖాన్‌ కడుపునొప్పితో ఆస్పత్రి పాలు..

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనారోగ్యానికి గురయ్యారు. కడుపునొప్పితో బాధపడుతున్న ఇమ్రాన్ ఖాన్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు.. ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ ఆయన ఆరోగ్యం క్షీణించడంపై ఓ వీడియోను ట్వీట్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జమాన్ పార్క్‌లోని ఇమ్రాన్ ఖాన్ ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఇమ్రాన్‌ను చికిత్స నిమిత్తం లాహోర్‌లోని షౌకత్ ఖనుమ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అక్కడ వైద్యులు చికిత్సనందించినట్లు తెలుస్తోంది.

వేసవిలో రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు..

వేసవిలో ప్రయాణాలు (Summer Trips), టూర్స్ (Tours), ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు రైల్వే శాఖ (Railway) ఎప్పటిలాగే ప్రత్యేక రైళ్లను (Special Trains) నడిపేందుకు నిర్ణయించింది. మొత్తం 380 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ (Railway Ministry) పేర్కొంది. పాట్నా, ఢిల్లీ, విశాఖపట్నం, ముంబై వంటి ప్రధాన కేంద్రాల మీదుగా మొత్తం 6,369 రైళ్ల ట్రిప్పులు నిర్వహించేందుకు నిర్ణయించింది. రైల్వే శాఖ గతేడాది 348 ప్రత్యేక రైళ్లతో ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 4,599 ట్రిప్పులను నిర్వహించింది. ఈ ఏడాది అదనంగా మరో 1,770 ట్రిప్పులను జోడించింది. ఈ ప్రత్యేక సర్వీసులు పాట్నా-యశ్వంత్‌పూర్, పాట్నా-సికింద్రాబాద్, విశాఖపట్నం-పూరీ-హావ్డా తదితర మార్గాల్లో నడపనున్నారు.

ఏపీ పాలిసెట్ ఫలితాలు వచ్చేశాయ్‌..

ఏపీ పాలిసెట్ ఫలితాలు వచ్చేశాయ్. రిజల్ట్స్ ను polycetap.nic.in వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష కోసం 1,60,329 అభ్యర్థులు నమోదు చేసుకోగా 1,43,592 మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసిన వారిలో 89.56 శాతం మంది విద్యార్ధులు ప్రవేశపరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో బాలికలు 63,201 మంది దరఖాస్తు దారుల్లో 55,562 ఉన్నారు. 87.91 శాతం మంది బాలికలు ప్రవేశపరీక్షకు మాజరయ్యారు. 97,128 మంది బాలురకు గాను 88,030మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. 90.63 శాతం మంది పరీక్షలు రాశారు.

పసిఫిక్‌ మహాసముద్రంలో వరుసగా రెండో రోజూ భారీ భూకంపం..

పసిఫిక్‌ మహాసముద్రం  ఆగ్నేయ ప్రాంతాన్ని వరుస భూకంపాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. నిన్న న్యూ కలెడోనియా కు తూర్పున ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం అదే ప్రాంతంలో మరోసారి భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 7.1 గా నమోదైనట్లు యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది.

వాలంటీర్లను నాయకులుగా చేస్తా..

గ్రామ, వార్డు వాలంటీర్లను నాయకులుగా చేస్తానని ముఖ్యమంత్రి జగన్‌ పునరుద్ఘాటించారు. వాలంటీర్లను ఉద్దేశించి తాను చేసిన తొలి ప్రసంగంలోనూ ఇదే చెప్పానన్నారు. వాలంటీర్ల రాజకీయ హక్కులకు, అభ్యుదయ, ఆదర్శ భావాలకు అవరోధాలు ఏవీ ఉండవని సీఎం తెలిపారు. ఎవరైనా ఫలానా పని చేయకూడదని అంటే వాళ్లకు గట్టిగా సమాధానం చెప్పాలని వాలంటీర్లకు సూచించారు. వారానికి రెండుసార్లు వేసేది హాజరు కాదని.. ఏ సమయంలోనైనా ప్రభుత్వానికి సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రెజెన్స్‌ను మార్కు చేసే కార్యక్రమంగా ముఖ్యమంత్రి వివరించారు.

ఐపీఎల్‌లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదేమో..

మరొక్క రోజులో లీగ్‌ దశ ముగియనున్నా ప్లేఆఫ్స్‌ చేరే మిగతా మూడు జట్లేవో తేలలేదు. మిగిలింది నాలుగు మ్యాచ్‌లే..! ముందంజ వేయడం కోసం ఆరు జట్లు ఇంకా రేసులోనే ఉన్నాయి. 15 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరువగా ఉన్న చెన్నై, లఖ్‌నవూ శనివారం తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లను ఆడనున్నాయి. కోల్‌కతాతో లఖ్‌నవూ ఢీకొననుండగా.. దిల్లీతో చెన్నై తలపడనుంది. చెన్నై, లఖ్‌నవూ గెలిస్తే చెరో 17 పాయింట్లతో మిగతా ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్‌ బెర్తులు సాధిస్తాయి.