NRI-NRT

సింగ‌పూర్‌లో ప్రపంచ తెలుగు ఐటీ మహాసభ..

సింగ‌పూర్‌లో ప్రపంచ తెలుగు ఐటీ మహాసభ..

వాషింగ్టన్ డీసీలో డబ్య్లూటీఐటీసీ స్కై సోరర్ ను ఆ సంస్థ ఛైర్మన్ సందీప్ మఖ్తల ఇంకా మంత్రి కేటీఆర్ కలిసి లాంచ్ వేశారు. ఈ సందర్భంగా కేటీఆర్, సందీస్ మఖ్తల మాట్లాడుతూ.. అమెరికాలో ఉన్న తెలుగు టెక్కీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తమ సంస్థలు, నైపుణ్యాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మన ఐటీ నిపుణులు స్టార్టప్ ల వైపు మొగ్గు చూపాలని, స్వదేశంలో పెట్టుబడులు పెట్టాలని వారు సూచించారు.

తెలుగు వారికి ఎంతో వృద్ధి చెందే అవకాశాలున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు టెక్నోక్రాట్లను ఒక తాటిపైకి తెచ్చేందుకు ఏర్పడిన డబ్య్లూటీఐటీసీ తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు తీసుకురావడం, ఎంట్రప్రెన్యూర్ షిప్, స్టార్టప్ లను ప్రోత్సహించడం, వివిధ భాగస్వామ్య పక్షాల మధ్య కోఆర్డినేషన్ టార్గెట్ గా కృషి చేస్తోంది.

వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ ఛైర్మన్ సందీప్ మఖ్తల ఈ మేరకు ఇప్పటికే మలేషియా, సింగపూర్, యూఏఈ, ఒమన్ తదితర దేశాల్లో పర్యటించారు. ప్రస్తుతం ఆయన షికాగో, డలాస్, వాషింగ్టన్ డీసీ, అస్టిన్, శాన్ అంటానియో, ఎస్ఎఫ్ఓ, సిలికాన్ వ్యాలీ నగరాలతో పాటు కెనడా, మెక్సికోలోని పలు నగరాలు పర్యటిస్తున్నారు.

ఇక సింగపూర్ లో వచ్చే ఆగష్టు 5,6 తేదీల్లో జరగబోయే ప్రపంచ తెలుగు ఐటీ మహాసభ సన్నాహక వేదికగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా.. ఆయా దేశాల్లో పర్యటిస్తూ టెక్కీలను అనుసంధానం చేస్తున్నారు.