హాస్య . బ్రహ్మ బ్రహ్మానందం ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఆయన చిన్న కొడుకు సిద్దార్థ్ నిశ్చితార్థం నేడు ఘనంగా జరిగింది. బ్రహ్మానందంకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు గౌతమ్ గురించి అందరికి తెలుసు. గౌతమ్ హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. అయితే బ్రహ్మీ చిన్న కొడుకు సిద్దార్థ్ గురించి చాలా తక్కువమందికి తెలుసు. అతను విదేశాల్లో చదువుకొని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఇక ఈ మధ్యనే సిద్దార్థ్ నిశ్చితార్థం.. డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె అయిన ఐశ్వర్య తో ఘనంగా జరిగినట్లు తెలుస్తుంది. ఐశ్వర్య కూడా డాక్టరే కావడం విశేషం. ఈ వేడుకకు కమెడియన్ ఆలీ, రఘుబాబు, టి. సుబ్బిరామిరెడ్డి తదితరులు విచ్చేసి కొత్త జంటను ఆశీర్వదించారు. నూతన జంట చూడముచ్చటగా ఉంది. ఈ పెళ్లి పెద్దలు కుదిర్చినట్లు తెలుస్తోంది.
ఇక వేడుకలో ఎప్పటిలానే బ్రహ్మీ నవ్వులు పూయించారు. సిద్దార్థ్ కూడా హీరో మెటీరియల్ లానే కనిపిస్తున్నాడు. అయితే అతనికి ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతోనే బ్రహ్మీ చిన్న కొడుకును ఇండస్ట్రీకి దూరంగా ఉంచాడని సమాచారం. ఇక ఈ జంట పెళ్లి త్వరలోనే జరగనుందట. ఈ వివాహాన్ని బ్రహ్మీ అంగరంగ వైభవంగా చేయనునన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.