సాధారణంగా మనిషి చనిపోతే సావు చేయడానికి ఎంత డబ్బు అవసరం అవుతుంది. ఈరోజు లెక్కల ప్రకారం అయితే మొత్తం దినాలు దాకా చూస్కుంటే ఓ 3 లక్షలు మరి డబ్బున్నోళ్లు అయితే, 10 లక్షలు ఖర్చు పెట్టి గ్రాండ్ గా చేస్తారు. కానీ ఓ పెద్దావిడ చనిపోతే లక్ష కాదు కోటి కాదు వంద కోట్లు కావు ఏకంగా 162 మిలియన్ పౌండ్లు అంటే మన దేశ కరెన్సీలో 1655 కోట్లు అంటే నమ్ముతారా.. ఇది నేను చెబుతున్న మాట కాదు బ్రిటన్ కోశాగార విభాగం ఓ నివేదిక విడుదల చేసింది.
వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ అదేనండి యూకే రాణి అయిన ఎలిజబెత్ 70 ఎళ్ల పాటు బ్రిటన్ ను పాలించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 8న కాలం చేశారు ఎలిజబిత్. ఆమె అంతక్రియలను బ్రిటన్ దేశం ఘనంగా నిర్వహించింది. ఘనంగా అంటే ఆషామాషీ కాదు 1655 కోట్లు ఖర్చు చేసి బ్రిటన్ రోడ్లన్ని పూలతో నింపి ఘనంగా సాగనంపారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశ ప్రతినిధులు అందరు హజరైయ్యారు.