NRI-NRT

పంజాబ్ సరిహద్దుల్లో పాక్ డ్రోన్‌ను కూల్చేసిన భారత్….

పంజాబ్ సరిహద్దుల్లో పాక్ డ్రోన్‌ను కూల్చేసిన భారత్….

భారత్‌లోకి అక్రమంగా డ్రగ్స్‌ను తరలిస్తున్న పాకిస్థానీ డ్రోన్‌ను భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అధికారులు కూల్చివేశారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగిందీ ఘటన. డ్రోన్‌ను కూల్చేసిన అధికారులు అది మోసుకెళ్తున్న డ్రగ్స్‌ సంచిని స్వాధీనం చేసుకున్నారు. బీఎస్ఎఫ్ అధికారులు పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చడం రెండు రోజుల్లో ఇది నాలుగోసారి. శనివారం రాత్రి అమృత్‌సర్ సెక్టార్‌లో భారత గగనతలాన్ని ఉల్లంఘించిన డ్రోన్‌ను కూల్చివేసినట్టు బీఎస్ఎఫ్ తెలిపింది. డ్రోన్‌ను, అనుమానిత మాదకద్రవ్యాల బ్యాగును స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది.

నాలుగు పాకిస్ధాన్ డ్రోన్లను అడ్డుకున్నామని, అందులో మూడింటిని 24 గంటల వ్యవధిలో పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద కూల్చేసినట్టు అధికారులు తెలిపారు. మూడు డ్రోన్లను శుక్రవారం రాత్రి, ఒక దానిని శనివారం రాత్రి కూల్చివేసినట్టు వివరించారు.