టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని కైత్లాపూర్ గ్రౌండ్‌లో శనివారం ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో నందమూరి కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ అధికారులు భారీ ఏర్పాట్లు చేసి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే బాలకృష్ణ, పురందేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి, వసుంధర, బ్రహ్మాణి, దేవాన్ష్, నందమూరి కుటుంబ సభ్యులతోపాటు రాజకీయ ప్రముఖులు సీతారాం ఏచూరి, డి.రాజా, సినీ ప్రముఖులు వెంకటేశ్, జయప్రద, జయసుధ, మురళీ మోహన్, రామ్ చరణ్, బాబు మోహన్, విజయేంద్ర ప్రసాద్, అల్లు అరవింద్, అశ్వినీదత్, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, అనిల్ రావిపూడి, శ్రీలీలతోపాటు కన్నడ నటుడు శివరాజ్‌కుమార్, నాగచైతన్య, సుమంత్, సిద్ధు జొన్నలగడ్డ, అడివిశేష్ వంటి పలువురు సినీ తారలు ఈ వేడుకలకు హాజరయ్యారు.