కాంగ్రెస్ హైకమాండ్ రాజకీయ పావులు కదుపుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్..జగన్ లక్ష్యంగా అడుగులు వేస్తోంది. వైఎస్ షర్మిల కేంద్రంగా కొద్ది రోజులు తెలంగాణలో కొత్త రాజకీయం మొదలైంది. షర్మిలతో నేరుగా ప్రియాంక గాంధీ టచ్ లోకి వచ్చారు. సుదీర్ఘ మంతనాలు జరిగాయి. ఏపీ..తెలంగాణలో షర్మిల పాత్ర పైన క్లారిటీ ఇచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో కర్ణాటక నూతన డిప్యూట సీఎం డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. భవిష్యత్ ప్లాన్ ప్రతిపాదించారు.
తాజాగా కాంగ్రెస్ ను తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని షర్మిల చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు మిస్డ్‌కాల్స్ వస్తున్నాయి కానీ, ఆ కాల్స్‌కు తాను ఆన్సర్ చేయలేదని షర్మిల చెప్పుకొచ్చారు. ఏదైనా నిర్ణయం ఉంటే ఓపెన్ గానే చెబుతానని స్పష్టం చేసారు. తాను మరో పార్టీలో విలీనం చేసేందుకు తన పార్టీ పెట్టలేదని తేల్చి చెప్పారు. అయితే, ప్రియాంక గాంధీ తాజాగా షర్మిలతో ఫోన్ లో సుదీర్ఘంగా సంప్ర దింపులు జరిపారు. షర్మిల – ప్రియాంక మధ్య డీకే శివకుమార్ మధ్యవర్తిత్వం వ్యవహరించారు. డీకే శివకుమార్ తో షర్మిల కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు అవి తాజా పరిణామాలకు కీలకంగా మారాయి.షర్మిలను కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించడానికి డీకే తన వంతు కృషి చేశారు. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ఆ పార్టీ నుంచి ప్రతిపాదన వచ్చినప్పటికీ షర్మిల అంగీకరించలేదు.