Movies

ఇండస్ట్రీలో మరో విషాదం….

ఇండస్ట్రీలో మరో విషాదం….

ముంబై అంధేరిలోని తన అపార్ట్మెంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈరోజు అపార్ట్మెంట్లోని బాత్రూంలో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రగ్ ఓవర్ డోస్ వల్లే మరణించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్రాంతివీర్, మైనే గాంధీకో నహీ మారా చిత్రాలతో పలు రియాలిటీషోల్లో ఆదిత్య పాల్గొన్నారు.

యాక్టర్ అండ్ మోడల్ ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ సోమవారం మధ్యాహ్నం మరణించాడు. బాత్రూమ్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో నిర్జీవంగా కనిపించాడు. అతను ఉంటోన్న అపార్ట్‌మెంట్‌లోని 11వ అంతస్తు వాష్‌రూమ్‌లో అపస్మారక స్థితిలో ఉన్నాడని అతని స్నేహితుడు గుర్తించి.. సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ అక్కడకు చేరుకునేలోపే మరణించినట్లు ధృవీకరించారు వైద్యులు. కాగా, డ్రగ్ ఓవర్ డోస్ కారణంగానే అతను చనిపోయినట్లు తెలుస్తోంది