Politics

శరత్ బాబు మృతికి చంద్రబాబు సంతాపం…

శరత్ బాబు మృతికి చంద్రబాబు సంతాపం…

సీనియర్ నటుడు శరత్ బాబు తీవ్ర అనారోగ్యంతో కన్నుమూయడం తెలిసిందే. గత కొన్ని రోజులుగా హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. దీనిపై టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు మరణవార్త దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు. వివిధ భాషల చిత్రాల్లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన శరత్ బాబు దక్షిణాది ప్రేక్షకులను మెప్పించారని వివరించారు. శరత్ బాబు మృతి సినీ రంగానికి తీరని లోటు అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన ఆత్మశాంతికై ప్రార్థిస్తున్నానని, ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని వెల్లడించారు.