ScienceAndTech

వాట్సాప్ యూజర్లకు శుభవార్త…

వాట్సాప్ యూజర్లకు శుభవార్త…

యూజర్లకు వాట్సాప్ తీపికబురు అందించింది.వాట్సప్‌లో పంపే సందేశా(మెసేజ్‌)లలో ఏవైనా తప్పులు ఉంటే,దాని అర్థం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఒకవేళ అక్షర దోషం ఉన్నా, పొరపాటుగా మెసేజ్‌ పంపినా వాటిని డిలీట్‌ చేయడం మినహా మరో దారిలేదు. ఈ సమస్యకు పరిష్కారంగానే వాట్సప్‌ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. తాము పంపిన మెసేజ్లను యూజర్లు ఎడిట్ చేసుకోవచ్చని చెప్పిన వాట్సాప్ ఇందుకోసం పంపిన మెసేజ్పై లాంగ్ ప్రెస్ చేయాలని, అనంతరం మెనూ బటన్లో ఎడిట్ ఆప్షన్ ఎంచుకోవాలని తెలిపింది. మెసేజ్ పంపిన ఈ మేరకు మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో ప్రకటించారు. దీంతో మెసేజ్‌ పంపిన తర్వాత కూడా ఆ సందేశాన్ని మార్చుకునే సదుపాయాన్ని ఈ ఎడిట్‌ ఆప్షన్‌ కల్పిస్తుంది.15 నిమిషాల్లోపు మెసేజ్ ఎడిట్ చేసుకోవచ్చని.. మెసేజ్ ఎడిట్ చేసిన విషయం చదివిన వారికి కూడా తెలుస్తుందని వాట్సాప్ పేర్కొంది. ప్రస్తుతం కొందరు యూజర్లకే ఈ ఫీచర్ వస్తోంది. ప్రస్తుతం కొద్దిమంది యూజర్లు మాత్రమే ఎడిట్‌ ఫీచర్‌ అందుబాటులో ఉంది. ఈ వారంలో ప్రపంచవ్యాప్తంగా యూజర్లందరికీ ఎడిట్‌ ఫీచర్‌ అందుబాటులోకి వస్తుందని వాట్సప్‌ తెలిపింది.