Movies

G20 ఫిల్మ్ టూరిజం చర్చలో పాల్గొననున్న మెగా పవర్ స్టార్….

G20  ఫిల్మ్ టూరిజం చర్చలో పాల్గొననున్న మెగా పవర్ స్టార్….

ఫిల్మ్ టూరిజం గురించి చర్చించడానికి G20 సమ్మిట్‌కు హాజరయ్యేందుకు వెళుతున్న రామ్ చరణ్

జమ్మూకశ్మీరులోని శ్రీనగర్‌లో G20 ఫిల్మ్ టూరిజం గ్రూప్ మీట్‌ అట్టాహాసంగా ప్రారంభమైంది. సాయుధ భద్రతా దళాల పహారాలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ సమావేశంలో విదేశీ ప్రతినిధులతో పాటు పలువురు సెలబ్రెటీలు  కూడా పాల్గొంటున్నారు. అంతర్జాతీయ ప్రతినిధులతో పాటు సౌత్ ఇండియా స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సదస్సులో పాల్గొనడానికి శ్రీనగర్ కు చేరుకున్నారు. ఫిల్మ్ టూరిజం చర్చలో చరణ్ పాల్గొంటారు.

RRR తర్వాత రామ్ చరణ్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీలలో ఒకరిగా మారారు. దేశవ్యాప్తంగా పలు కీలక కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అతని గౌరవప్రదమైన ఉనికి మరియు ప్రవర్తన అంతా ప్రశంసించబడింది.

జమ్మూ & కాశ్మీర్‌లో పర్యాటక చర్చల కోసం జి20 ఇండియా సమ్మిట్ జరుగుతోంది. ఈ కార్యక్రమం మే 22 నుంచి మే 24 వరకు జరగనుంది

ఆర్థికాభివృద్ధి మరియు సాంస్కృతిక పరిరక్షణ కోసం ఫిల్మ్ టూరిజంపై చర్చించేందుకు ఆయన ఇప్పుడు శ్రీనగర్‌లోని #G20సమ్మిట్‌లో పాల్గొంటున్నారు. సమ్మిట్‌లో పాల్గొనేందుకు వెళుతున్న ఆయన హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించారు.

ఈ మూడు రోజుల సదస్సులో 25 దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. వర్క్ ఫ్రంట్‌లో, అతను ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్‌తో బిజీగా ఉన్నాడు