Politics

పొంగులేటి ఓ బచ్చా అని పువ్వాడ విమర్శలు….

పొంగులేటి ఓ బచ్చా అని పువ్వాడ విమర్శలు….

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మరోసారి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫై ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో పొంగులేటి ఒక బచ్చా అంటూ ఎద్దేవా చేసాడు. ఆదివారం ఖమ్మం జిల్లాలో కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పొంగులేటి..కేసీఆర్ ప్రభుత్వం ఫై , కేసీఆర్ ఫై పలు విమర్శలు చేసారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు.

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి డబ్బు బలం చూసుకుని విర్రవీగుతున్నారని.. ఏ పార్టీలోకి పోవాలో తేల్చుకోలేని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు ఓ సిద్ధాంతం, విలువలు అనేవి లేవి విమర్శించారు. పొంగులేటి తనను తాను కాస్త అతిగా ఊహించకుంటున్నారని.. ఆ ఊహలో నుంచి ఎంత త్వరగా బయటకు వస్తే అంత మంచిదని హితవు పలికారు. రాజకీయాల్లో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఒక బచ్చా అని మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు.