క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళవారం నిరసన కార్యక్రమం తలపెట్టారు. ఇందులో భాగంగా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ స్థలంలో నిరసనకు కోటంరెడ్డి ప్లాన్ చేశారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం కోటంరెడ్డి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. కోటంరెడ్డి ఇంట్లో నుంచి బయటికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మాగుంట లేఅవుట్ లోని కోటంరెడ్డి ఇంటి వద్ద ఉద్రికత్త వాతావరణం నెలకొంది.
నెల్లూరులోని గాంధీనగర్ లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణంపై వివాదం నెలకొంది. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళవారం నిరసన కార్యక్రమం తలపెట్టారు. ఇందులో భాగంగా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ స్థలంలో నిరసనకు కోటంరెడ్డి ప్లాన్ చేశారు.
అందుకోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణ స్థలంలో టెంట్లు వేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని జిల్లా మైనారిటీ అధికారి లేఖ రాసినట్లుగా చెబుతున్నారు. దీంతో పోలీసులు, కోటంరెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఎవరూ అడ్డుకున్నా నిరసన కార్యక్రమం జరిపి తీరుతామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటున్నారు.