Movies

పవన్ ఫ్యాన్స్‏కు మంచి కిక్కిచ్చే న్యూస్….

పవన్ ఫ్యాన్స్‏కు మంచి కిక్కిచ్చే న్యూస్….

పవన్ కళ్యాణ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ‘తొలిప్రేమ’ను మరోసారి థియేటర్లలో చూసే అవకాశం వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 30న రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి రెడ్డి నటించగా.. కమెడియన్ అలీ కీలక పాత్ర పోషించారు. ‘తొలిప్రేమ’ రీరిలీజ్ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ నెట్టింట సందడి చేస్తున్నారు.