బ్రిటన్ దేశం కొత్త నియమాలకు తెరతీసింది. యూకే కి ప్రైమ్ మిరిస్టర్ గా రిషీ సునక్ బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి ఎన్నో కొత్త విధానాలకు నాంది పలుకుతున్నాడు. కాగా, తాజాగా మరో కొత్త పాలసీని తీసుకవచ్చారు. ఇన్ని రోజులు చదువు కోసమని బ్రిటన్ కు వెల్లే వారు తమ కుటుంబ సభ్యూలను తమ దేశానికి అనుమతి ఇస్తూ వచ్చింది. తాజాగా, నేడు ఈ ప్రక్రియకు స్వస్తి పలికింది. ఇక నుంచి అలా తీసుకరావడం కుదరదని కొత్త నియమావలిని జారీ చేసింది.
తాజాగా వచ్చిన నిబంధనల ప్రకారం విద్యార్థులిక తమ కుటుంబసభ్యులను బ్రిటన్‌కు తీసుకెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేసింది. తమ దేశానికి వలస వచ్చిన వారి జాబితాను మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన విడుదల కానుంది. ఈ ఏడాది సుమారు 7 లక్షల మంది బ్రిటన్ కు వలస వచ్చారని నెషనల్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా తీసుకున్న పాలసీ భారతీయులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక నుంచి కేవలం పరిశోధన విభాగానికి చెందిన పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసిస్తున్న విదార్థులు మాత్రమే తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లొచ్చని బ్రిటన్ హోంమంత్రి సువెల్లా బ్రేవర్మన్ తెలిపారు. ఈ విషయాన్ని మంగళవారం కామన్స్ సభలో ప్రకటించారు. విదేశీ విద్యార్థి చదువు పూర్తికాకముందు ఉద్యోగం చేయడానికి కూడా ఇక నుంచి వీలులేదని స్పష్టం చేశారు.