టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ ) ఫలితాలను గురువారం ఉదయం 9:30 గంటలకు మంత్రి సబితాఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.
టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ ) ఫలితాలను గురువారం ఉదయం 9:30 గంటలకు మంత్రి సబితాఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఆమె ఉన్నతాధికారులతో కలిసి ఫలితాలను రిలీజ్ చేస్తారు. వాస్తవానికి, ఫలితాలను ఉదయం 11 గంటలకు కూకట్‌పల్లి జేఎన్టీయూలో విడుదల చేయాల్సి ఉన్నది. అయితే, జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశంకానుండటం, దీనికి మంత్రి సబిత హాజరుకానున్న నేపథ్యంలో 9.30 గంటలకే ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఉదయం 9.45 గంటల తర్వాత ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
ఎంసెట్ ఫలితాల కోసం www.ntnews.com వెబ్‌సైట్‌లో చూడగలరు.