Movies

60 ఏళ్ల వయస్సులో ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి..పద్మావతి హ్యాపీయేనా

60 ఏళ్ల వయస్సులో ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి..పద్మావతి హ్యాపీయేనా

పోకిరి సినిమాలో ఇలియానాను ఏడిపించే పోలీస్ ఆఫీసర్ గుర్తున్నాడా..? అదేనండీ .. పండుగాడు.. టైల్స్ ఏస్తన్నారంటగా.. పద్మావతి హ్యాపీయేనా అంటూ వార్నింగ్ ఇచ్చే సీన్ ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. ఆ అందులో నటించిన నటుడే ఆశిష్ విద్యార్థి. విలన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చే పాత్రలు చేసిన ఆశిష్ విద్యార్థి.. ఈ మధ్యనే వచ్చిన రైటర్ పద్మభూషణ్ సినిమాలో హీరో సుహాస్ కు తండ్రిగా నటించి మెప్పించాడు. ఇక తాజాగా ఈ విలన్ 60 ఏళ్ల వయస్సులో రెండో పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చాడు. అస్సాంకు చెందిన రూపాలి బారువాను అత్యంత సన్నహితుల మధ్య రెండో వివాహం చేసుకున్నాడు. రూపాలి.. కలకత్తాలో బిజినెస్ ఎంట్రఫ్యూనర్ గా ఉంది. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని వార్తలు వచ్చాయి. అయితే వాటికి చెక్ పెడుతూ వీరు పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చారు.

ఇక ఆశిష్.. మొదటి భార్య రాజోషి. ఆమె నటిగా చాలామందికి తెలుసు. ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి. అయితే గత కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య విబేధాలు జరుగుతున్నాయని, ఇద్దరు విడివిడిగా ఉంటున్నారని తెలుస్తుంది. కానీ, ఈ జంట విడాకులు తీసుకున్నట్లు ఒక్క వార్త కూడా రాకపోవడం గమనార్హం. అసలు విడాకులు తీసుకున్నారా..? లేదా..? అనేది ఎవరికి తెలియని మిస్టరీ. మరి మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రూపాలిని ఎలా వివాహం చేసుకొని ఉంటాడని నెటిజన్లు ఆరాలు తీస్తున్నారు. ఇకపోతే ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. పద్మావతి ఇప్పటికైనా హ్యాపీయేనా.. జాగ్రతగా చూసుకో అంటూ ఫన్నీగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.