ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal) రేపు తెలంగాణకు రానున్నారు. రేపు సీఎం కేసీఆర్‌తో (Cm Kcr) కేజ్రీవాల్ భేటీ కానున్నారు. ఢిల్లీలోని ప్రభుత్వ అధికారుల బదిలీలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ (Ordinance) విషయంలో సీఎం కేసీఆర్‌ను కలిసే అవకాశం ఉంది. దాంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన ప్రభుత్వానికి మద్దతు కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రేపు హైదరాబాద్‌కు రానున్నారు.
ఢిల్లీతో పాటు కొన్ని ప్రాంతాల్లో (సివిల్) సర్వీసెస్ (డీఏఎన్ఐసీఎస్) కేడర్‌లోని గ్రూప్-ఎ అధికారుల బదిలీలు, క్రమశిక్షణ చర్యల కోసం నేషనల్ కేపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ పేరుతో కేంద్రం ఇటీవల ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇప్పటికే ఆ మద్దతుకు పలువురు ముఖ్యమంత్రులను, నాయకులను కోరుతున్న విషయం తెలిసిందే.