Politics

రాజమండ్రి మహానాడుకి మన్నవ మోహనకృష్ణ 25లక్షల విరాళం…

రాజమండ్రి మహానాడుకి మన్నవ మోహనకృష్ణ 25లక్షల విరాళం…

రాజమండ్రిలో జరగనున్న మహానాడు వేడుకలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్,
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహనకృష్ణ 25 లక్షల రూపాయల చెక్కును తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి అందజేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మన్నవ మోహనకృష్ణని అభినందిస్తూ, ఎన్నో సంవత్సరాలుగా అటు అమెరికాలోను, ఇటు ఆంధ్రప్రదేశ్ లోను తెలుగుదేశం పార్టీకి అండగా వుంటూ తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం ఎంతో శ్రమించిన మన్నవ మోహనకృష్ణని అభినందించారు.

ఈ 2023 మహానాడుకి 25 లక్షల రూపాయలు అందించటమే గాక గత సంవత్సరం 2022లో ఒంగోలులో జరిగిన మహానాడుకు కూడా మన్నవ మోహనకృష్ణ 31 లక్షల రూపాయలు విలువైన వాటర్ బాటిల్స్ ని అందజేసిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించి మన్నవ మోహనకృష్ణని ప్రశంసించారు.