NRI-NRT

ఉత్త‌ర‌ కొరియాలో బైబిల్ తో ప‌ట్టుబ‌డితే పెద్ద‌ల‌కు మ‌ర‌ణ‌శిక్ష…చిన్నరులకు జీవిత ఖైదీ

ఉత్త‌ర‌ కొరియాలో బైబిల్ తో ప‌ట్టుబ‌డితే పెద్ద‌ల‌కు మ‌ర‌ణ‌శిక్ష…చిన్నరులకు  జీవిత ఖైదీ

ఉత్త‌ర‌కొరియా(NORTH KORIA) అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్(KIM JONG UN) గురించి ప్ర‌త్యేకంగా పరిచ‌యం అక్క‌ర్లేదు. దేశంలో చేసే అభివృద్ది కంటే తాను తీసుకునే సంచ‌ల‌న  నిర్ణయాలతోనే కిమ్ వార్త‌ల్లో హాట్ టాఫిక్ గా నిలుస్తుంటాడు. తాజాగా కిమ్ మ‌రో దారుణానికి పాల్ప‌డ్డాడు. ఉత్త‌ర‌కొరియాలో బైబిల్(BIBLE) ను నిషేధించారు. కానీ ఓ జంట బైబిల్ తో అక్క‌డి పోలీసుల‌కు ప‌ట్టుబ‌డింది. దాంతో కిమ్ వారికి ఏకంగా మ‌ర‌ణ‌శిక్ష‌ను విధిస్తూ ఆదేశించాడు.

ఇక ఆ దంప‌తుల‌కు ఓ చిన్నారి బిడ్డ కూడా ఉంది. ఆ రెండేళ్ల‌ చిన్నారి పై కూడా ద‌య లేకుండా కిమ్ సర్కార్ జీవిత ఖైదు విధిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇదిలా ఉంటే ఉత్త‌ర‌ కొరియాలో బైబిల్ తో ప‌ట్టుబ‌డితే పెద్ద‌ల‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించ‌డంతో పాటు వారి సంతానానికి జీవిత‌ఖైదు వేస్తామ‌ని అక్కడి చ‌ట్టాల్లో పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలోనే కిమ్ స‌ర్కార్ మ‌రోసారి క్రూర‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించింది.

ఉత్త‌ర‌కొరియాలో కిమ్ స‌ర్కార్ క్రైస్త‌వ్వంతో (CHRISTIANS) పాటూ మ‌రికొన్ని మ‌తాల‌ను కూడా నిషేధించింది. ఆ మతాల‌ను ఫాలో అయినా, మ‌త‌ప్ర‌చారాలు చేసినా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు. ఇప్ప‌టికే ఉత్త‌ర‌కొరియాలో 70వేల మంది క్రైస్తవుల‌తో పాటూ ఇత‌ర మ‌తాల‌కు చెందిన‌వారు శిక్ష‌ను అనుభ‌విస్తున్నారు. ఇదిలా ఉంటే ఉత్త‌ర‌కొరియాలో 70.9శాతం మంది నాస్తికులు ఉన్నారు. 11 శాతం మంది బౌద్ద‌మ‌త‌స్థులు ఉన్నారు.