NRI-NRT

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం….

అమెరికాలో మరోసారి  కాల్పుల కలకలం….

అగ్రరాజ్యం అమెరికా లో మరొసారి కాల్పుల కలకలం రేగింది. అమెరికాలోని న్యూ మెక్సికోలో దుండుగులు కాల్పులకు ఒడిగట్టారు. అక్కడ నిర్వహించిన బైక్ ర్యాలీలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి (Three died) చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

అప్రమత్తమైన పోలీసులు దుండుగున్ని పట్టుకునే ప్రయత్నం చేయగా నిందితుడు అక్కడి నుంచి పరారయ్యడు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు పలు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. కాగా క్షతగాత్రులను పోలీసులు చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది